Sonusood: సోనూసూద్ కు మరో గుడి... ఈసారి ఏ గ్రామంలో కట్టారంటే?
కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకుని సామాన్య ప్రజల మనసు దోచుకున్నారు సోనూసూద్.
కరోనాకు ముందు సోనూసూద్ అంటే ఒక నటుడు మాత్రమే. కరోనా తరువాత అతను చాలా మంది ఆరాధ్య నటుడిగా, అభిమాన వ్యక్తిగా మారిపోయారు. కారణం కరోనా సమయంలో తన సొంత ఖర్చుతో ఎంతో మంది వలస కూలీలని సొంతూళ్లకు పంపారు. ఎంతో మంది కష్టాలను పంచుకున్నారు. అప్పట్నించి అతనంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది ప్రజల్లో. తాజాగా ఖమ్మం జిల్లాలోని బోనకల్ జోన్ లోని గార్లపడ అనే గ్రామంలో కూడా సోనూసూద్ కు ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన గుర్రం వెంకటేష్ అనే అభిమాని తన ఇంటి ఆవరణలో ఈ చిన్న గుడిని నిర్మించారు. అందులో సోనూసూద్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేశారు.
గతంలో కూడా సిద్ధిపేట జిల్లా దుబ్బతండా గ్రామంలో సోనూకు గుడిని నిర్మించారు గ్రామస్థులు. హరతులిస్తూ, భజనలు చేస్తూ, జానపడ పాటలు పాడుతూ సోనూసూద్ ఆరాధించారు. చిన్న సభ ఏర్పాటు చేసి అతను చేసిన మంచి పనులను చెప్పుకున్నారు. కరోనా కష్టకాలంలో ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకునేందుకు ఇలా గుడి కట్టామని అప్పట్లో చెప్పారు దుబ్బతండా గ్రామస్థులు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సోనూ సూద్ ఎవరికైనా కష్టం ఉందని తెలిస్తే తనకు తోచిన రీతిలో సాయాన్ని అందించారు. ఆ మనస్తత్వమే ప్రజల మనసులు గెలుచుకుంది.
Gurram Venkatesh of Garlapada village in Bonakal zone of Khammam district has constructed a temple for real hero @SonuSood. WOW! pic.twitter.com/TLbbjeErPO
— Kaushik LM (@LMKMovieManiac) October 7, 2021
Also read: నిల్వ పచ్చళ్లు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?
Also read: నవరాత్రి పూజా సామాగ్రి... అమెజాన్ లో తక్కువ ధరకే
Also read: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఆరోగ్యకరమైన పద్ధతులు ఇవిగో...
Also read: బొప్పాయి వల్ల నిజంగానే గర్భం పోతుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
Also read: చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి
Also read: సెప్సిస్ గురించి విన్నారా? పైకి కనిపించకుండా ప్రాణాలు తీసేస్తుంది...
Also read: బాయ్ ఫ్రెండ్ కు అందంగా కనిపించాలనుకుంది... చివరకు ఆసుపత్రి పాలైంది