Entertainment Top Stories Today: ‘దేవర’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, ‘గేమ్ ఛేంజర్’ సెకండ్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Entertainment News Today In Telugu: ‘దేవర’ మొదటి వీకెండ్ కలెక్షన్స్ నుంచి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సెకండ్ సింగిల్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.
‘దేవర’ మొదటి వీకెండ్‌లో రూ.304 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘గేమ్ ఛేంజర్’ సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ను నిర్మాతలు విడుదల చేశారు. సత్యదేవ్ ‘జీబ్రా’ టీజర్, శ్రీవిష్ణు ‘స్వాగ్’ ట్రైలర్ విడుదల అయ్యాయి. బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు లభించింది.
రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఈ రేంజ్‌లో ఉండాల..
గ్లోబల్ సార్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఎలా ఉండాలి? సినిమా చూడటానికి థియేటర్లలోకి వచ్చిన ఆడియన్స్ చేత, మరీ ముఖ్యంగా మెగా అభిమానుల చేత స్టెప్పులు వేయించేలా ఉండాలి. మాంచి మాస్ నంబర్ ఇవ్వాలి. అందులోనూ దర్శకుడు శంకర్ సినిమాలో సాంగ్స్ అంటే... సంగీత దర్శకుడు ఎస్ తమన్ మ్యూజిక్ అంటే... అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా 'రా రా మచ్చా' ఉందని చెప్పాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
క్రేజీగా సత్యదేవ్ ‘జీబ్రా’ టీజర్
టాలెంటెడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ ట్యాగ్ లైన్ తో రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే మోషన్ పోస్టర్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రధారులను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ ను విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
శ్రీ విష్ణు ‘స్వాగ్‘ ట్రైలర్ చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే
యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘స్వాగ్’. ‘పెళ్లి చూపులు’ బ్యూటీ రీతూ వర్మ, సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. శ్వాగణిక వంశం కథాంశంతో కామెడీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నాడు. స్టోరీని రివీల్ చేయకుండా శ్రీవిష్ణు మరోసారి తన ఫన్ తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది. ‘దేశంలో ఏ మగాడైనా మాకు మొక్కాల్సిందే’ అనే డైలాగ్ ట్రైలర్ లోనే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరో పలికే అచ్చ తెలుగు పదాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘వృషణాలు వణకాలి’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ కడుపుబ్బా నవ్విస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఊచకోత
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 304 కోట్లు వసూళు చేసింది. తొలి రోజు రూ. 172 కోట్లు సాధించిన ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 243 కోట్లు సంపాదించింది. తాజాగా చిత్ర బృందం అధికారికంగా మూడు రోజుల వసూళ్ల వివరాలను వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు
సినిమా రంగానికి ఇటీవల కాలంలో వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మ విభూషణ్ నుంచి మొదలుకొని రీసెంట్ గా గిన్నిస్ రికార్డ్, ఐఫా అవార్డ్స్ లో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డుకు ఎంపికైనట్టు ప్రకటన రావడం సినీ వర్గాలను సంతోషంలో ముంచెత్తింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)