ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ప్రారంభం కాగానే అది టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రెండో స్థానంలో నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘సరిపోదా శనివారం’ ఉంది. మూడో స్థానంలో విక్రాంత్ మస్సే నటించిన ‘సెక్టార్ 36’ నిలిచింది. ‘కల్కి 2898 ఏడీ’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ‘ఐసీ 814: కాందహార్ హైజాక్’ నిలిచింది. విజయ్ సేతుపతి ‘మహారాజ’ ట్రెండింగ్‌లో ఆరో స్థానంలో నిలిచింది. నెట్ ఫ్లిక్స్ సిరీస్ ‘సెక్స్/లైఫ్’ ఏడో స్థానంలో ఉంది. కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా ‘ఇండియన్ 2’ ఎనిమిదో స్థానం దక్కించుకుంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక నటించిన ‘యానిమల్’ తొమ్మిదో స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్ ‘మహరాజ్’ ఈ జాబితాలో పదో స్థానం దక్కించుకుంది.