Zebra Movie: మరీ ఇలాంటి పాస్ వర్డ్ కనిపెట్టాలంటే ఎలా... క్రేజీగా సత్యదేవ్ ‘జీబ్రా’ టీజర్
ZEBRA Teaser: సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జీబ్రా’. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైంది. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
Zebra Movie Teaser: టాలెంటెడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ ట్యాగ్ లైన్ తో రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే మోషన్ పోస్టర్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రధారులను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ ను విడుదల చేశారు.
‘జీబ్రా’ టీజర్ విడుదల చేసిన నాని
‘జీబ్రా’ మూవీ టీజర్ ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. యాక్షన్ క్రైమ్ కామెడీగా ఈ మూవీ రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేసే యువకుడిగా కనిపించనున్నారు. ధనుజయను నెగెటివ్ పాత్ర పోషిస్తున్నారు. సునీల్, సత్యరాజ్ డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నారు. ‘మత్తు వదలరా 2’ ఫేం సత్య ఈ సినిమాలోనూ కామెడీతో ఆకట్టుకోనున్నట్లు అర్థం అవుతోంది. ఈ టీజర్ లో ఆయన వేసే పంచులు నవ్వులు పూయించాయి. చివరగా సత్యదేవ్ పాస్ వర్డ్ గురించి చెప్పే మాటలను అందరినీ నవ్విస్తాయి. టీజర్ లో డబ్బు, కార్లు, ఓడలు, విమానాలు, ఆవును చూపించడం ఆసక్తి కలిగిస్తోంది. సత్యదేవ్, ధనుంజయ విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు.
అక్టోబర్ 31న ‘జీబ్రా’ మూవీ విడుదల
ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘పుష్ప’ మూవీతో ఫేమస్ అయిన ధనంజయ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. సునీల్, సత్యరాజ్ సహా ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటోంది. సినిమాటోగ్రాఫర్ సత్య పొన్మార్ విజువల్ టేకింగ్ ఆకట్టుకుంటున్నది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమాకు మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘కృష్ణమ్మ‘ సినిమాతో ఆకట్టుకున్న సత్యదేవ్
సత్యదేవ్ చివరగా ‘కృష్ణమ్మ‘ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కు వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ఊచకోత... మూడు రోజుల్లు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు
View this post on Instagram
Read Also: ఏ మగాడైనా వాళ్లకి మొక్కాలట... శ్రీ విష్ణు ‘స్వాగ్‘ ట్రైలర్ చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే