అన్వేషించండి

SWAG Trailer: ఏ మగాడైనా వాళ్లకి మొక్కాలట... శ్రీ విష్ణు ‘స్వాగ్‌‘ ట్రైలర్‌ చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే

SWAG Theatrical Trailer: శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను కామెడీతో కడుపుబ్బా నవ్విస్తోంది.

Sree Vishnu Swag Trailer: యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘స్వాగ్’. ‘పెళ్లి చూపులు’ బ్యూటీ రీతూ వర్మ, సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. శ్వాగణిక వంశం కథాంశంతో  కామెడీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నాడు. స్టోరీని రివీల్ చేయకుండా శ్రీవిష్ణు మ‌రోసారి త‌న ఫన్ తో  ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోబోతున్న‌ట్లు తెలుస్తుంది. ‘దేశంలో ఏ మగాడైనా మాకు మొక్కాల్సిందే’ అనే డైలాగ్ ట్రైలర్ లోనే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరో పలికే అచ్చ తెలుగు పదాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘వృషణాలు వణకాలి’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ కడుపుబ్బా నవ్విస్తోంది.

నిధిని దక్కించుకునేది ఎవరు?

దర్శకుడు హసిత్ గోలి ఈ సినిమాను 1551వ సంవత్సరంలో మొదలైన కథ 2024కి కనెక్ట్ చేసి చూపిస్తారు. శ్వాగణిక వంశానికి చెందిన కోట్ల రూపాయల నిధిని దక్కించుకోవడం కోసం శ్రీ విష్ణు, రీతూ వర్మ ఎలా పోటీపడ్డారు అనేది ఈ మూవీలో చూపించనున్నారు. ఈ సినిమాలో రీతూ వర్మ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్లు అర్థం అవుతోంది. చాలా కాలం తర్వాత మీరా జాస్మిన్ తెలుగు సినిమాలో కనిపిస్తోంది.

'రాజ రాజ చోర' తర్వాత మరో మూవీ

‘స్వాగ్’ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘రాజ రాజ చోర’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘స్వాగ్’ మూవీలో సునీల్, దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Also Readథియేటర్లలోకి ఈ వారం సందడి - ఒక్క శుక్రవారమే 8 తెలుగు సినిమాలు, ఇంకా...

హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?

‘స్వాగ్’ సినిమా విజయాన్ని అందుకుంటే, శ్రీవిష్ణు ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్లు అవుతుంది. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలతో ఆయన వరుస విజయాలు అందుకున్నారు. ఈ సినిమా కూడా హిట్ అందుకుంటే ఆయన టైర్ 2 హీరోగా మారే అవకాశం ఉంటుంది.  ‘రాజరాజచోర’ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు హసిత్ రెండో చిత్రంతో ఫ్లాప్ చవిచూశాడు. మూడో చిత్రంతో మళ్లీ హిట్ అందుకోవాలని భావిస్తున్నారు.  పురుషాధిక్యం, మహిళా సాధికారత అనే పాయింట్ తో తెరకెక్కతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో అనే విషయం త్వరలో తెలియనుంది. 

Read Also: ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు... లడ్డూ వివాదంలో సెటైరికల్ ట్విట్టర్ యుద్ధం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
Embed widget