అన్వేషించండి

Prakash Raj vs Manchu Vishnu: ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు... లడ్డూ వివాదంలో సెటైరికల్ ట్విట్టర్ యుద్ధం

తిరుపతి లడ్డు వివాదం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ల మధ్య ట్వీట్ల యుద్ధానికి కారణం అయ్యింది. హద్దుల్లో ఉండండి అంటూ హెచ్చరించిన మంచు విష్ణుకు ప్రకాష్ రాజ్ సెటైరికల్ రిప్లై ఇచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు వివాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే ఆ లడ్డులో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్ వాడారు అనే వాదన తెరపైకి రావడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, పలు ధార్మిక సంస్థలు సైతం ఈ విషయంపై సత్వర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పలువురు సెలబ్రిటీలు ఈ వివాదంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ కి కౌంటర్ గా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్ వేశారు. 

ప్రకాష్ రాజ్ కి మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ 
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా లడ్డు వివాదంపై చేసిన కామెంట్స్ కు మంచు విష్ణు తాజాగా కౌంటర్ వేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ "మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ సంఘటన జరిగింది. దానిపై విచారణ జరిపించి, నేరస్తులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకు మీరు అనవసరమైన భయాలను దీనిపై కల్పించి, జాతీయస్థాయిలో చర్చ జరిగేలా సాగదీస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన గొడవలు చాలు, దీనిపై మీరే చర్యలు తీసుకోవాలి" అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు ఇచ్చిన రిప్లై సంచలనంగా మారింది.

"గౌరవనీయులైన ప్రకాష్ రా..జ్ మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డు అంటే కేవలం ప్రసాద్ మాత్రమే కాదు కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక కూడా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరడంతో పాటు ధర్మ పరిరక్షణ కోసం ఆయన తగిన చర్యలు తీసుకుంటారు కూడా. ఈ వ్యవహారంలో మీలాంటి వాళ్ళు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో, మత కల్లోలం రంగును ఎవరు, ఎక్కడ, ఎప్పుడు పులుముతున్నారో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. మీ హద్దుల్లో మీరు ఉండండి" అంటూ సీరియస్ గా రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Also Readవెంకటేష్ సినిమా సెట్స్‌లో బాలకృష్ణ సందడి - ఆ స్మైలూ, ఎఫెక్షనూ సూపరంతే

ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు - అప్పుడు అలా ఇప్పుడు ఇలా... సీన్ రివర్స్ 
గతంలో మా ఎలక్షన్స్ టైంలో అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఎంత స్ట్రాంగ్ గా పోరాడినప్పటికీ ఈ ఎలక్షన్స్ లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచాడు. ఇక ఆ తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే మా ఎలక్షన్ టైంలో ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఎన్నో ఈవెంట్లలో ప్రకాష్ రాజ్ ని స్వయంగా పవన్ కళ్యాణ్ సమర్ధించారు కూడా. ఇక ఆ టైంలో విష్ణు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే, ప్రకాష్ రాజ్ ఆయనకు అండగా నిలిచారు. "పవన్ కళ్యాణ్ ఓపెనింగ్స్ అంత ఉండవు నీ సినిమా కలెక్షన్స్" అనే విధంగా ఓ టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ అప్పట్లో కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడేమో అదే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ గా ట్వీట్ చేస్తే, మంచు విష్ణు పవన్ కి సపోర్ట్ చేయడం గమనార్హం. ఇక విష్ణుకి ప్రకాష్ రాజ్ "ఓకే శివయ్య.. మీకు ఒక పర్సెప్షన్ ఉంటే నాకు ఒక పర్సెప్షన్ ఉంటుంది. నోటెడ్" అంటూ సెటైరికల్ సమాధానం చెప్పాడు.

Also Readసుకుమార్ భార్య తబిత బర్త్‌ డే సెలబ్రేషన్స్... ఫారిన్‌లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
Embed widget