Entertainment Top Stories Today: ‘దేవర’ ఐదు రోజుల కలెక్షన్స్, కొండా సురేఖకు నాగార్జున కౌంటర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Entertainment News Today In Telugu: ‘దేవర’ ఐదు రోజుల కలెక్షన్స్ నుంచి ‘జోకర్ 2’ రివ్యూ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.
‘దేవర’ మొదటి ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను రూ.110 కోట్ల వరకు వసూలు చేసింది. మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ సినిమా ‘జోకర్ 2’ సినిమా రివ్యూ. రజనీకాంత్ లేటెస్ట్ సినిమా ‘వేట్టయన్’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై నాగార్జున స్పందించారు. బాలీవుడ్ రామాయణం సెట్స్‌పైకి కేజీయఫ్ స్టార్ యష్ డిసెంబర్ నుంచి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది.
‘దేవర’ ఐదు రోజుల కలెక్షన్లు
బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ కలెక్షన్లలో దూసుకుపోతుంది. మిక్స్‌డ్ టాక్‌తో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఐదో రోజు అయిన మంగళవారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.5.55 కోట్లు (జీఎస్టీ కాకుండా) వసూలు చేసింది. జీఎస్టీ కలుపుకుంటే ఈ వసూళ్లు రూ.6.07 కోట్లుగా ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.98.64 కోట్ల షేర్‌ను (జీఎస్టీ కాకుండా) ‘దేవర’ వసూలు చేసింది. జీఎస్టీ కూడా కలుపుకుంటే నాలుగో రోజు వసూళ్లతోనే తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
జోకర్ 2 రివ్యూ: రెండు ఆస్కార్స్, 9 వేల కోట్లు కొల్లగొట్టిన సిన్మాకు సీక్వెల్
'జోకర్' థియేటర్లలోకి వచ్చి ఐదేళ్లు. ఇప్పటికీ ఆ సినిమా, అందులో జోక్విన్ ఫీనిక్స్ నటనను మర్చిపోలేం. ఉత్తమ నటుడిగా ఆయనకు, నేపథ్య సంగీతానికి మరొకటి... రెండు ఆస్కార్స్ వచ్చాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే రూ. 9000 వేల కోట్లు దాటాయి. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు, పలు ప్రతిష్టాత్మక అవార్డులు కొల్లగొట్టిన ఆ సినిమా సీక్వెల్ 'జోకర్ ఫోలీ అ దు' ఇండియాలో నేడు (అక్టోబర్ 2న) విడుదలైంది. అమెరికాలో ఈ నెల 4న విడుదల కానుంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? ఆస్కార్ అవార్డు తెచ్చిన పాత్రలో జోక్విన్ ఫీనిక్స్ ఎలా నటించారు? లేడీ గగా పాత్ర ఎలా ఉంది? అనేది చూడండి. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నాగార్జున
తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ నటుడు నాగార్జునపై, ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కారణమని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. తన ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన కండీషన్లకు నాగార్జున ఒప్పుకున్నారన్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కొండా సురేఖ చేసిన ఆరోపణలపై నటుడు నాగార్జున ఘాటుగా స్పందించారు. (ఆయన ఏమన్నారో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.)
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎలాంటి విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు. ఇప్పటికే లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ ని ఏకిపారేస్తున్న ఆయన తాజాగా మంత్రి కొండా సురేఖకు ఇచ్చి పడేశారు. సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ప్రకాష్ రాజ్. (ప్రకాష్ రాజ్ ఏమన్నారో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.)
యష్ రామాయణంపై క్రేజీ అప్డేట్
'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారు. 2024 డిసెంబర్లో 'రామాయణం' షూటింగ్ను ప్రారంభించడానికి యష్ సిద్ధం అవుతున్నాడు. డిసెంబర్ నుంచి మొదలుకొని 2025 మొదటి మూడు నెలల పాటు 'రామాయణం' షూటింగ్లో బిజీ కాబోతున్నారు. ఆ తర్వాత 2025 వేసవి నుంచి సన్నీ డియోల్ హనుమంతుడిగా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. 'రామాయణం' అంటేనే రావణుడు హనుమంతుడు. ముఖ్యంగా హనుమంతుడు లంకను తగలబెట్టే సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ సినిమాలో హనుమంతుడు, రావణుడి పాత్రలను పోషిస్తున్న యష్, సన్నీ డియోల్ ఇద్దరి పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావాలంటే వచ్చే ఏడాది దాకా వెయిట్ చేయాల్సిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'వేట్టయన్' ట్రైలర్ వచ్చేసింది
సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వేట్టయన్ - ద హంటర్'. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకం మీద సుభాస్కరన్ నిర్మించారు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదలైంది. రీసెంట్‌గా రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ కొంత ఆందోళనలో ఉన్నారు. వాళ్లను సంతోషపెట్టేలా ట్రైలర్ వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)