అన్వేషించండి

Vettaiyan Trailer: 'వేట్టయన్' ట్రైలర్ వచ్చేసింది - రజనీకాంత్ ఎలివేషన్స్‌కు గూస్ బంప్స్ గ్యారంటీ

Vettaiyan Trailer Review: సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమా 'వేట్టయన్' ట్రైలర్ వచ్చేసింది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఆయన క్యారెక్టర్, ఆ హీరోయిజం సూపర్బ్ ఉన్నాయి. ఒక్కసారి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూడండి.

సూప‌ర్‌ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) టైటిల్ పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం 'వేట్టయన్ - ద హంట‌ర్‌'. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞాన‌వేల్ (TJ Gnanavel) ద‌ర్శ‌క‌త్వం వహించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ పతాకం మీద సుభాస్క‌ర‌న్ నిర్మించారు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదలైంది. రీసెంట్‌గా రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ కొంత ఆందోళనలో ఉన్నారు. వాళ్లను సంతోషపెట్టేలా ట్రైలర్ వచ్చింది. అది ఎలా ఉందో చూడండి.

రజనీకాంత్ హీరోయిజం కేక... గూస్ బంప్స్ గ్యారంటీ!
Rajinikanth Role In Vettaiyan Movie: 'వేట్టయన్'లో రజనీకాంత్ పోలీస్ రోల్ చేశారు. రౌడీలు, గూండాలు, నేరస్తుల పాలిట యముడిగా మారిన ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఆయన కనిపించనున్నట్లు ఆల్రెడీ విడుదల చేసిన ప్రివ్యూలో చూపించారు. అంతకు మించి అన్నట్టు ట్రైలర్ కట్ చేశారు. మహిళల మీద అత్యాచారాలు, అటువంటి మృగాళ్లను ఎన్కౌంటర్ చేసే సిస్టమ్ మీద సినిమా తీసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. విలన్లకు రజనీకాంత్ ఇచ్చే పంచ్, ఆ పంచ్ పవర్ కు ఒక్కొక్కరు కింద పడటం, ట్రైలర్ ఎండింగ్ అంతా సూపర్బ్ అనేలా ఉంది. 

హీరోయిజం చూపించడంలో రజనీకి ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన స్టైల్, ఆ మాస్ మేనరిజమ్స్ కోసం సినిమాలు చూసే ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళను ఫుల్ శాటిస్‌ఫై చేసేలా 'వేట్టయన్' రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. రజని హీరోయిజం చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటికి మంచి ఇంపార్టెన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఒక్కసారి ఆ ట్రైలర్ మీరూ చూడండి.

Also Readజోకర్ 2 రివ్యూ: రెండు ఆస్కార్స్, 9 వేల కోట్లు కొల్లగొట్టిన సిన్మాకు సీక్వెల్ - Joaquin phoenix మూవీ ఎలా ఉందంటే?

విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 10న విడుదల
తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విజయ దశమి సందర్భంగా అక్టోబ‌ర్ 10న 'వేట్టయన్ - ద హంట‌ర్‌' సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 'మ‌న‌కు ఎస్పీ అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు' అని రౌడీ చెప్పే డైలాగ్ ప్రివ్యూలో హైలైట్ అయ్యింది. అటువంటి డైలాగులు ఇంకా ఉన్నాయి.

'2.0', 'ద‌ర్బార్‌', 'లాల్ స‌లామ్' సినిమాల త‌ర్వాత ర‌జనీకాంత్, లైకా పొడక్షన్స్ సంస్థ క‌ల‌యిక‌లో... 'పేట‌', 'ద‌ర్బార్‌', 'జైల‌ర్' అనిరుద్ ర‌విచంద‌ర్, రజనీకాంత్ కలయికలో... వస్తున్న చిత్రమిది.

Also Read: సర్జరీ జరిగిన 50 రోజులకు... మాస్ మహారాజా రవితేజ మళ్లీ షూటింగ్ చేసేది ఎప్పుడంటే?

Vettaiyan - The Hunter Movie Cast And Crew: సూప‌ర్‌ స్టార్ ర‌జనీకాంత్‌ హీరోగా రూపొందిన 'వెట్టయన్ - ద హంటర్' సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజూ వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: ఫిలోమిన్ రాజ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  కె. క‌దిర్‌, యాక్ష‌న్‌: అన్బు - అరివు, ఛాయాగ్రహణం: ఎస్‌.ఆర్‌. క‌దిర్‌, సంగీతం: అనిరుద్ ర‌విచంద‌ర్‌, నిర్మాణ సంస్థ:  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, నిర్మాత: సుభాస్క‌ర‌న్‌, దర్శకత్వం: టీజే జ్ఞాన‌వేల్‌.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget