అన్వేషించండి

Ravi Teja: సర్జరీ జరిగిన 50 రోజులకు... మాస్ మహారాజా రవితేజ మళ్లీ షూటింగ్ చేసేది ఎప్పుడంటే?

ఆగస్టు 24వ తేదీన ఒక సినిమా చిత్రీకరణలో మాస్ మహారాజా రవితేజ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మళ్లీ ఆయన చిత్రీకరణకు ఎప్పుడు హాజరవుతారో తెలుసా? 

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హుషారుకు ఎనర్జీకి ఒక గాయం, ఓ సర్జరీ బ్రేకులు వేసింది. ఆగస్టు 24వ తేదీన ఓ సినిమా షూటింగ్ చేస్తుండగా ఆయన గాయపడ్డారు. చిత్రీకరణలో అనుకోని విధంగా ఇంజ్యూరీ కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స తీసుకుని ఒక రోజు తర్వాత డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లారు. మరి, మళ్లీ ఆయన చిత్రీకరణకు ఎప్పుడు హాజరు అవుతారో తెలుసా? 

అక్టోబర్ 14న రవితేజ 75వ సినిమా కొత్త షెడ్యూల్!
రవితేజ కథానాయకుడిగా శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మాస్ మహారాజాకు 75వ చిత్రం ఇది (RT75 Movie). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే రవితేజ గాయపడ్డారు. 

ఆగస్టు మూడో వారంలో రవితేజకు ఇంజ్యూరీ అయ్యింది. అయితే, ఆ విషయాన్ని ఆయన కాస్త ఆలస్యంగా చెప్పారు. ఆగస్టు 24వ తేదీన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లు రవితేజ తెలిపారు. త్వరలో సెట్స్ మీదకు మళ్ళీ రావాలని ఆశగా ఎదురు చూస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ఆ మాట చెప్పి ఇప్పటికే నెల దాటింది. మరో రెండు వారాల తర్వాత రవితేజ చిత్రీకరణ చేయడానికి రానున్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ఆయన 75వ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. భుజానికి గాయమైన తర్వాత రవితేజ మళ్ళీ చిత్రీకరణ చేయలేదు. ఈ నెల 14న సెట్స్ మీదకు వస్తారు.

Also Read: జోకర్ 2 రివ్యూ: రెండు ఆస్కార్స్, 9 వేల కోట్లు కొల్లగొట్టిన సిన్మాకు సీక్వెల్ - Joaquin phoenix మూవీ ఎలా ఉందంటే?


సంక్రాంతి బరి నుంచి రవితేజ తప్పుకున్నట్లే!
రవితేజ 75వ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. సినిమా మొదలైన తర్వాత ఆ విషయాన్ని చెప్పారు. అనుకోని పరిస్థితుల్లో రవితేజ విశ్రాంతి తీసుకోవలసి రావడం, షోల్డర్ ఇంజ్యూరీ వల్ల సుమారు నెల చిత్రీకరణ చేయకుండా ఉండడం వల్ల షూటింగ్ సజావుగా సాగలేదు. ముందుగా అనుకున్న విధంగా సినిమా ముందుకు వెళ్లలేదు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం కష్టమే. అయితే వచ్చే ఏడాది తప్పకుండా విడుదల అవుతుంది. 

'సామజవరగమన' రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన యువ కథానాయిక శ్రీ లీల (Sreeleela) నటిస్తోంది. 'ధమాకా' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రమిది.

Also Read: మీసంతో మగరాయుడిలా మారిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? - ఓ తెలుగు సినిమా చేసిందండోయ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Embed widget