అన్వేషించండి

Joker 2 Review - జోకర్ 2 రివ్యూ: రెండు ఆస్కార్స్, 9 వేల కోట్లు కొల్లగొట్టిన సిన్మాకు సీక్వెల్ - Joaquin phoenix మూవీ ఎలా ఉందంటే?

Joker Folie à Deux Review Telugu: 'జోకర్'కు గాను ఉత్తమ నటుడిగా జోక్విన్‌ ఫీనిక్స్‌ ఆస్కార్ అందుకున్నారు. దానికి ముందు బాక్సాఫీస్‌లో 9000 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ సినిమా సీక్వెల్ నేడు విడుదలైంది.

'జోకర్' (Joker) థియేటర్లలోకి వచ్చి ఐదేళ్లు. ఇప్పటికీ ఆ సినిమా, అందులో జోక్విన్‌ ఫీనిక్స్‌ (Joaquin Phoenix) నటనను మర్చిపోలేం. ఉత్తమ నటుడిగా ఆయనకు, నేపథ్య సంగీతానికి మరొకటి... రెండు ఆస్కార్స్ వచ్చాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే రూ. 9000 వేల కోట్లు దాటాయి. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు, పలు ప్రతిష్టాత్మక అవార్డులు కొల్లగొట్టిన ఆ సినిమా సీక్వెల్ 'జోకర్ ఫోలీ అ దు' (Joker Folie à Deux) ఇండియాలో నేడు (అక్టోబర్ 2న) విడుదలైంది. అమెరికాలో ఈ నెల 4న విడుదల కానుంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? ఆస్కార్ అవార్డు తెచ్చిన పాత్రలో జోక్విన్‌ ఫీనిక్స్‌ ఎలా నటించారు? లేడీ గగా పాత్ర ఎలా ఉంది? అనేది చూడండి. 

కథ (Joker 2 Story): టీవీ షోలో ముర్రే ఫ్రాంక్లిన్‌ను ఆర్థర్ ఫ్లెక్ చంపిన రెండున్నర ఏళ్ల తర్వాత 'జోకర్ 2' కథ మొదలు అవుతుంది. 

ఆర్థర్ ఫ్లెక్ (జోక్విన్‌ ఫీనిక్స్‌) గత రెండున్న సంవత్సరాలుగా గోతం సిటీలోని అర్ఖాన్ అసైలం (నేరాలకు పాల్పడిన మానసిక వికలాంగులను బంధించే ఆస్పత్రి)లో ఉంటాడు. ఒకవేళ అతను గనుక నేరం చేసినట్టు రుజువు అయితే మరణ శిక్ష పడుతుంది. అందుకని... ఆర్థర్ లోపల మరొక పర్సనాలిటీ ఉందని, తనను తాను జోకర్ అని చెప్పే అతను హత్యలకు పాల్పడ్డాడని ఆర్థర్ న్యాయవాది కోర్టులో వాదనలు మొదలు పెడుతుంది. 

ఆర్థర్ విడుదల అయ్యాడా? లేదంటే మరణ శిక్ష పడిందా? అసైలంలో అతనికి పరిచయమైన లీ (లేడీ గగా) ఎవరు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Joker 2 Review In Telugu): సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందులోనూ తొమ్మిది వేల కోట్ల వసూలు చేసిన సినిమాకు, ఉత్తమ నటుడిగా ఆస్కార్ వచ్చిన క్యారెక్టర్ కంటిన్యూ చేస్తూ తీసిన సినిమా అంటే అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. ఆ అంచనాలు చేరుకునే స్థాయిలో 'జోకర్ 2' ఉందా? అంటే... 'లేదు' అని చెప్పాలి.

'జోకర్ 2' గురించి విశ్లేషించే ముందు... 'జోకర్' విజయానికి కారణం ఏమిటి? అని ఆలోచిస్తే... హీరో క్యారెక్టరైజేషన్, ఆ సూపర్ విలనిజం, అందులో జోక్విన్‌ ఫీనిక్స్‌ నటన! 'జోకర్' విడుదలకు ముందు అంచనాలు ఎక్కువ ఏమీ లేవు. ఆ సినిమా అనూహ్య విజయానికి కారణం ఊహకు అందని రీతిలో జోకర్ చేసే పనులు, అతను స్పందించే తీరు. సమాజంలోని ఇతరులు తన గురించి ఏం అనుకుంటారోనని ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో అయినా ఆలోచించి ఉంటారు. అణిచివేతకు, అవమానానికి గురయ్యేలా చేసిన వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవాలని కలలోనైనా అనుకుని ఉంటారు. అటువంటి శాడిస్టిక్ ప్లెజర్ శాటిస్‌ఫై చేసేలా, ఐడెండిటీకి ముసుగు వేసి 'జోకర్' క్యారెక్టర్ క్రియేట్ చేయడంతో బ్లాక్ బస్టర్ సాధించింది.

'జోకర్ 2'కు వస్తే... ప్రేక్షకులు అందరికీ జోకర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు. ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది? ఎలా ఉండబోతుంది? అని కొన్ని అంచనాలు ఉన్నాయి. అటువంటి ఊహలకు భిన్నంగా దర్శక రచయితలు టాడ్ ఫిలిప్స్ - స్కాట్ సిల్వర్ 'జోకర్: ఫోలీ అ దు'ను రూపొందించారు. ప్రేక్షకులు మెచ్చిన సూపర్ విలనిజం ఈ 'జోకర్ 2'లో లేదు. ఆ కథతో సంబంధం ఉన్నప్పటికీ... జోకర్ పాత్ర తీరుతెన్నులు కొత్తగా కనిపించాయి. ఇందులో సైకలాజికల్ డ్రామా ఉంది. డ్రామా మాత్రమే ఉంది. సర్‌ప్రైజ్ చేసే సన్నివేశాలు, సూపర్ విలనిజం లేవు. దానికి తోడు పాటలు ఎక్కువ కావడంతో మొదటి నుంచి నీరసంగా, నిదానంగా సినిమా ముందుకు సా...గిం...ది. కోర్ట్ రూమ్ డ్రామా సైతం ఆసక్తిగా అనిపించదు. యాక్షన్ సీన్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు ఏమో!? అటువంటి ఆశలు వదులుకోండి.

'జోకర్' చివరిలో అతని పాత్రతో చాలా మంది కనెక్ట్ అవుతారు. అయితే... ఆ ప్రభావం ప్రేక్షకుల మీద పడకూడదని, ఆ క్యారెక్టర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని దర్శకుడు 'జోకర్ 2' తీసినట్టు ఉన్నారు. ఆర్థర్ / జోకర్ పాత్రను విలనీగా కాకుండా బాల్యం నుంచి ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ వల్ల ఆ విధంగా ప్రవర్తించాడని గుర్తు పెట్టుకోవాలని కోరుకున్నారు. దర్శక రచయితల ఆలోచన మంచిదే. కానీ, అది కథ నుంచి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయిన క్యారెక్టర్‌ను దూరం చేసింది. ఈ కథను మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ కింద తీయాలని అనుకోవడం వల్ల ఎక్కువ పాటలు పెట్టక తప్పలేదు. ఒక దశ తర్వాత ఆ పాటలు ఆకట్టుకోలేదు. ఇరిటేట్ చేశాయి.

టెక్నికల్ అంశాల పరంగా 'జోకర్ 2' ఉన్నత స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఆ కెమెరా వర్క్. ఆర్థర్ సంతోషంగా ఉన్నప్పుడు, ఆర్థర్ బాధగా ఉన్నప్పుడు... లైటింగ్, ఫ్రేమ్స్ ద్వారా ఆ ఫీలింగ్స్ చూపించిన తీరు బావుంది. కథలో లీనం చేయడానికి నేపథ్య సంగీత దర్శకుడు చాలా ప్రయత్నించారు. వార్నర్ బ్రదర్స్, డీసీ స్టూడియోస్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పడానికి ఏముంది? హై స్టాండర్డ్స్ మెంటైన్ చేశారు.

Also Read: 'సత్యం సుందరం' రివ్యూ: తమిళ్‌లో బ్లాక్‌ బస్టర్ టాక్ - మరి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉందా?


ఆర్థర్ పాత్రలో మరోసారి జోక్విన్‌ ఫీనిక్స్‌ జీవించారు. ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఈ సినిమా ప్రారంభంలో అసైలంలో ఆయనను చూపించే సన్నివేశం ఉంది. జైలు జీవితం వంటిది రెండున్నరేళ్లు గడిపిన తర్వాత మనిషి ఎలా మారతాడు? అనేది కేవలం బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపించిన తీరు అద్భుతం. కోర్ట్ రూమ్ సీన్లలో జోకర్ మోనోలాగ్స్, ఇంకా లేడీ గగా మీద ప్రేమ చూపించేటప్పుడు ఒదిగిపోయారు. లేడీ గగా ఓకే. ఆ పాత్రకు తగ్గట్టు నటించారు.

'జోకర్' అభిమానులను, ఆ సినిమాలో సూపర్ విలనీ మెచ్చిన జనాలను 'జోకర్ 2' డిజప్పాయింట్ చేస్తుంది. బట్, జోక్విన్‌ ఫీనిక్స్‌ మరోసారి ఆస్కార్ లెవల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. పాటలు స్టోరీ ఫ్లో డిస్టర్బ్ చేశాయి. కానీ, నేపథ్య సంగీతం బావుంది. జోక్విన్‌ ఫీనిక్స్‌ కోసం సినిమాను ఓసారి చూడొచ్చు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లండి.

Also Read'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget