Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్
Konda Surekha: తాజాగా సమంత, నాగ చైతన్య విడాకులు కేటీఆర్ కారణం అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అందులో ఏముందో చూసేద్దాం పదండి.
Prakash Raj tweets on Konda Surekha 'Chay Sam divorce' comments: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి సౌత్ నుంచి నార్త్ దాకా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు ప్రకాష్ రాజ్. ఇప్పటికే లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ ని ఏకిపారేస్తున్న ఆయన తాజాగా మంత్రి కొండా సురేఖకు ఇచ్చి పడేశారు. సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ప్రకాష్ రాజ్.
సమంత - నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్
నాగ చైతన్య, సమంత డివోర్స్ అయ్యి చాలా రోజులే అవుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గానే మారుతుంది. త్వరలో ఆయన శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకోబోతున్నాడు. మరోవైపు సమంత సినిమాలతో బిజీగా ఉంది. ఇలాంటి టైంలో తాజాగా మంత్రి కొండా సురేఖ వీరి విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వల్ల ఎంతో మంది హీరోయిన్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం కూడా అతనే అంటూ ఫైర్ అయ్యింది.
'ఆయన (కేటీఆర్) అప్పట్లో మత్తు పదార్థాలకు అలవాటు పడి, వారిని కూడా అలవాటు పడేలా చేసి, రేవ్ పార్టీలు చేసుకోవడమే కాకుండా మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు' అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టాడని చెప్పి అందరినీ నోళ్లు వెళ్ళబెట్టేలా చేసింది. అంతే కాకుండా ఇండస్ట్రీలో ఈ విషయం అందరికీ తెలుసని, ఇదొక ఓపెన్ సీక్రెట్ అంటూ ఆమె మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మాట్లాడిన మాటలపై విరుచుకుపడుతున్నారు నెటిజెన్లు.
ఏంటి ఈ సిగ్గులేని రాజకీయాలు ?
మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ 'ఏంటి సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళు అంటే చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్' అంటూ సూటిగా ప్రశ్నించారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. నిన్న మొన్నటిదాకా పవన్ లడ్డూ వివాదంలో కొంత మంది ఆయన తీరును వ్యతిరేకించినప్పటికీ... తాజాగా కొండా సురేఖ విషయంలో ప్రకాష్ రాజ్ వ్యవహరించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ఈ వివాదంలో నాగ చైతన్య, సమంత విడాకులను మధ్యలోకి లాగడం అనేది కరెక్ట్ కాదంటూ కొండా సురేఖపై విరుచుకుపడుతున్నారు మూవీ లవర్స్.
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa
— Prakash Raj (@prakashraaj) October 2, 2024
లడ్డూ వివాదం సద్దుమణిగినట్టేనా?
తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై వరుసగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు ప్రకాష్ రాజ్. కానీ పవన్ మాత్రం స్పందించలేదు. మరి ఇప్పుడు ఆ వివాదాన్ని వదిలేసి ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందించడంతో లడ్డూ వివాదం సద్దుమణిగినట్టేనా? లేక రెండు విషయాలపై ప్రకాష్ రాజ్ తన గళం విన్పిస్తారా? అనేది చూడాలి.