Ennenno Janmalabandham November 8th: మాళవికని ఆడుకుంటున్న ఖుషి- యష్ గురించి వేదకి నిజం చెప్పేసిన అభిమన్యు
వేద లేకుండానే ఖుషిని తీసుకుని యష్ పిక్నిక్ వెళతాడు. అటు అభిమన్యుని మాళవిక ఎదిరించడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పిక్నిక్ కి వెళ్తున్న ఖుషికి వేద అన్ని జాగ్రత్తలు చెప్తుంది. ఆ మాటలు అన్ని చెప్తూ వేద కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి యష్ కూడా బాధపడతాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చెయ్యమని వేద చెప్తుంది. ఖుషి వెళ్లిపోతుంటే వేద తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. అన్నయ్యతో ఫోటోలు తీసుకుని అన్ని నాకు పంపించు అని ఏడుస్తూనే చెప్తుంది. అటు మాలిని కూడ బాధపడుతుంది. ఖుషి తనని వదిలివెళ్లలేక మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మా అని పిలిచి వేదని కౌగలించుకుని చాలా ఏడుస్తుంది. ఆ సీన్ ఎమోషనల్ గా ఉంటుంది. హ్యపీగా వెళ్ళి హ్యపీగా ఎంజాయ్ చెయ్యి అని వేద తనని పంపిస్తుంది.
ఖుషి వాళ్ళ కోసం మాళవిక, ఆదిత్య ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఖుషిని చూసి ఆదిత్య హ్యపీగా ఫీల్ అవుతాడు. మాళవిక ఖుషిని నవ్వుతూ పలకరిస్తుంటే తను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. వేద కిటికీ దగ్గర వచ్చి ఖుషిని చూస్తుంది. తనని చూసి లవ్యూ చెప్పి బై చెప్తుంది. వేద చూస్తుందని మాళవిక కావాలనే యష్ పక్క సీట్లో కూర్చుంటుంది. వసంత్ వచ్చే సరికి చిత్ర విపరీతమైన కోపంగా ఉంటుంది. అసలు ఎందుకు అక్క అలా చేసింది ఆ మాళవిక ఖుషిని మాత్రమే పిక్నిక్ కి పంపించమని అడిగితే వేద అక్క ఒప్పించడం ఏంటి అని చిరాకు పడుతుంది. వసంత్ మాత్రం వేద వదిన్ని తిట్టకు కళ్ళు పోతాయి, తనని గొప్పగా చెప్తాడు.
Also Read: మోనితకి నిజం చెప్పేసిన దుర్గ - శౌర్యని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయిన ఇంద్రుడు
వేద యష్ ఇంకా ఫోన్ చేయలేదని ఎదురుచూస్తూ ఉంటుంది. కావాలని ఆ మాళవిక నన్ను బాధపెట్టాలని ఆదిత్యని అడ్డం పెట్టుకుని పిక్నిక్ కి వెళ్ళిందని తిట్టుకుంటుంది. అప్పుడే వేదకి యష్ కాల్ చేస్తాడు. ఖుషి ఏం చేస్తుందని అడుగుతుంది. ఆదిత్యతో ఆడుకునేది యష్ అమ్మ ఫోన్ లైన్లో ఉందని చెప్పేసరికి పరిగెడుతూ వెళ్తుంది. అది చూసి మాళవిక కుళ్ళుకుంటుంది. ఆకలి వేస్తుందని మీకోసం స్నాక్స్ పెట్టాను డాడీకి కూడా పెట్టు నేను చేసినవి అంటే బాగా తింటారు అని చెప్తుంది. నాన్నతో ఒక సెల్ఫీ దిగి తనకి పంపించమని అడుగుతుంది. ఈ పిక్నిక్ అయ్యేలోపు ఎలాగైనా ఖుషిని తనవైపు తిప్పుకోవాలని మాళవిక అనుకుంటుంది.
యష్ పంపించిన సెల్ఫీ చూసుకుని వేద మురిసిపోతుంది. మాళవిక మళ్ళీ కారులో యష్ సీట్ పక్కనే కూర్చోవడానికి వెళ్తుంటే ఖుషి వెంటనే వెళ్ళి తను కూర్చుంటుంది. ఫ్రస్టేట్ అయిన మాళవిక నీది వెనుక సీట్ కదా అని అనేసరికి నాన్న కార్లో సీట్లు అమ్ముతారా అని ఖుషి కౌంటర్ వేసేసరికి యష్ నవ్వుతాడు. మాళవిక ఖుషితో మాట్లాడుతుంటే తను మాత్రం యష్ కి సమాధానం చెప్తుంది. వేద ఖుషికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించింది, ఈ పిక్నిక్ అయ్యేలోపు దాని అంచనాలు తారుమారు చేసి తీరతాను అని అనుకుంటుంది. ఖుషి, ఆదిత్య సంతోషంగా ఆడుకుంటుంటే యష్ మురిసిపోతూ ఉంటాడు. ఇద్దరు పిల్లలు ఎంతబాగా కలిసిపోయారో కదా అని మాళవిక అనేసరికి కలిసి పెరగాల్సిన వాళ్ళు నువ్వు చేసిన పాడు పని వల్ల వాళ్ళిద్దరూ శిక్ష అనుభవిస్తున్నారని కోపంగా అంటాడు. నీమీద పీకల దాకా కోపం ఉన్నా నా పిల్లలిద్దరు కలిసి ఆడుకోవడం చూడాలని ఈ పిక్నిక్ ఒప్పుకున్నా అని అంటాడు. ఆ వేద వల్లే మనకి అన్ని ప్రాబ్లమ్స్ అని మాళవిక ఆదిత్యతో అనడం ఖుషి వింటుంది.
తరువాయి భాగంలో..
అభిమన్యు వేదకి యష్ గురించి నిజం చెప్తాడు. నీ భర్త నీకు చేస్తున్న మోసం గురించి నీకు తెలుసా.. మీ అమ్మకి యాక్సిడెంట్ చేసింది మరెవరో కాదు నీ భర్త మొదటి పెళ్ళాం మాళవిక. తనని కాపాడుతుంది ఎవరో తెలుసా యష్ అని అభిమన్యు చెప్పడంతో వేద షాక్ అవుతుంది.