Guppedanta Manasu November 5th: దేవయానికి దిమ్మతిరిగేలా వార్నింగ్ ఇచ్చిన వసు- మినిస్టర్ ని కలిసేందుకు వెళ్తున్న మహేంద్రని రిషి చూస్తాడా?
Guppedantha Manasu November 5th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
వసు తనకి తోడుగా ఉన్నందుకు రిషి చాలా సంతోషంగా ఉంటాడు. ఈ దీపాలు, నువ్వు నేను, ఆకాశం ఇంతకంటే ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పు అని వసుతో అంటాడు. ఆకాశానికి మొక్కుకుందాం అని చెప్పి వసు దణ్ణం పెట్టుకుని ప్రదక్షణలు చేస్తూ తన చున్నీ కాలికి చుట్టుకుని రిషి మీద తూలి పడిపోతుంది. ఇద్దరి చూపులు కలిసి కాసేపు రొమాన్స్ నడుస్తుంది.
రిషి: మన మధ్య అడ్డుతెరలు తొలగిపోయాయి, నీ మనసు మారింది, డాడ్ వాళ్ళు ఇంటికి వస్తే చాలు, అంతకంటే ఏమి అవసరం లేదు
వసు: తప్పకుండా వస్తారు సర్ బలంగా కోరుకుంటే జరుగుతుంది
రిషి: నువ్వు నాకు వరంగా దొరికా వసుధార
వసు: రిషిధార ఎంత మంచి పేర్లో కదా
Also Read: మాధవ్ దేవి తండ్రి కాదని తెలిసి షాకైన సత్య- ఆదిత్యతో తిరగొద్దని రుక్మిణికి చెప్పిన రామూర్తి
మహేంద్ర రిషి గురించి బాధపడుతూ అన్నం తినకపోయేసరికి జగతి బతిమలాడుతుంది. రిషి సంతోషంగా ఉండాలంటే మొదట నువ్వు సంతోషంగా ఉండాలి అని ముందు తిను అని చెప్తుంది. ఇద్దరూ ఒకరికొకరు అన్నం తినిపించుకుంటారు. అమ్మగా ఒడిపోయాను కదా అని జగతి బాధపడుతుంది. రిషి, వసుల్ బంధం ఎక్కడ బీటలు వారుతుందో అని జగతి భయపడుతుంది. వసు సంతోషంగా కిందకి వస్తుంటే దేవయాని ఎదురుపడుతుంది. నీకు సిగ్గనిపించడం లేదా అని దేవయాని వసుని తిడుతుంది. మీ భాష మార్చుకుంటే బాగుంటుందని వసు బదులిస్తుంది.
వసు: రిషి సర్ కి మీ గురించి చెప్పడం ఒక్క క్షణం పట్టదు కానీ చాడీలు చెప్పడం నా మనస్తత్వం కాదు. రిషి సర్ తో ఉండే హక్కు నాకు ఉంది. ఆయన నా జీవితం, తనతో కలిసి జీవితాంతం ప్రయాణిస్తాను. మీరు లేనిపోనివి ఆలోచించి మా మీద గూఢచారి పెట్టడం మంచిది కాదు జాగ్రత్త
Also Read: ఇంద్రుడి గురించి దీపని అడిగిన మోనిత- శౌర్యని బలవంతంగా తీసుకెళ్లిపోతున్న ఆనందరావు
ఏం మిడిసిపడుతున్నావ్ రిషి నీ వైపు ఉన్నాడు అనే కదా మళ్ళీ రిషిని నా వైపుకి తిప్పుకుంటాను అని దేవయాని మనసులో అనుకుంటుంది. అటు రిషి, ఇటు వసు ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇద్దరు కాసేపు ఫోన్లో చాటింగ్ పెట్టేస్తారు. ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ తమ తమ గదుల్లో నుంచి బయటకి వచ్చి నిలబడతారు. మెసేజ్ చేసుకుంటూ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడతారు. రిషి వసుని తన గదిలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. జగతి గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. రిషి మెయిల్ పెట్టాడు, ముందు మినిస్టర్ దగ్గరకి వెళ్ళి మాట్లాడతాము తర్వాత మిగతా దాని గురించి ఆలోచిస్తాను అని జగతి చెప్తుంది.
మనం అక్కడ రిషి వాళ్ళకి కనిపిస్తే ఎలా అని మహేంద్ర అంటే వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్త పడదాములే అని జగతి సర్ది చెప్తుంది. వసు తలస్నానం చేసి జుట్టు తుడుచుకుంటుంటే రిషి వచ్చి హెయిర్ డ్రయర్ పెడతాడు. మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారని వసు లాక్కోవడానికి చూస్తుంది. కానీ రిషి ఇవ్వకపోయేసరికి ఇద్దరూ ఒకరికొకరు లాక్కుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతారు. చూపు చూపు కలిసి రొమాన్స్ నడుస్తుంది.