Ennenno Janmalabandham April 7th: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర
వేద, విన్నీకి ఐలవ్యూ చెప్పడంతో యష్ తనని తప్పుగా అర్థం చేసుకుని దూరం పెట్టేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తుంటే ఎదురుగా మాళవిక ఉంటుంది. కూతుర్ని డ్రాప్ చేసే తీరిక కూడా లేదా నునవ్వు అద్దెకి తెచ్చుకున్న అమ్మకి అని వెటకారంగా మాట్లాడుతుంది. వేదని నువ్వు చేసుకుంది దొంగ పెళ్లి అని. తొందర్లోనే ఆ పెళ్లి పెటాకులు కాబోతోంది. నీ లైఫ్ లో వైఫ్ అనే పదం లేకుండా దేవుడు బ్యాన్ చేశాడు. అప్పుడు నేను వెళ్లిపోయాను ఇప్పుడు వేద వెళ్ళిపోతుంది. భర్త స్థానం నీకు అచ్చి రాలేదు, భార్యకి నువ్వు నచ్చడం లేదు. నీ జాతకం ఏంటో కానీ మాజీ భర్త అనే బిరుదు నిన్ను వదలను అంటుందని నవ్వుతుంది.
Also Read: ట్రయల్ రూమ్‌లో విక్రమ్, దివ్య సరసాలు - నందు, తులసిని చూసి రగిలిపోతున్న లాస్య
యష్: నీ మీద నాకు కోపం రావడం లేదు నన్ను హర్ట్ చేయాలని చూస్తున్నావ్ కానీ ప్రయోజనం లేదు. హర్ట్ అయ్యింది నేను కాదు నువ్వు నష్టపోయింది నువ్వు. నా భార్య స్థానం వద్దనుకుని వెళ్లిపోయావ్ ఏం పాముకున్నావ్. పెళ్లి లేదు తాళి లేదు ఏం బతుకు నీది. నీ సొంత తమ్ముడు నిన్ను ఛీ కొట్టాడు. నువ్వు పెద్ద సున్నావి అని కాస్త గడ్డి పెట్టేస్తాడు. మాళవిక అభిమన్యు దగ్గరకి వస్తుంది. ఏదో జరిగినది లేదంటే వేద ఖుషి దగ్గరకి రాకుండా ఉండడని మనసులో అనుకుంటుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. యష్ ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంటే చూశానని చెప్తుంది. మన ప్లాన్ వర్కవుట్ అయ్యిందని అభి మనసులో సంతోషపడతాడు. వేద, యష్ కి మధ్య ఏదో చెడినట్టు ఉందని అనుమానపడుతుంది. ఖుషిని తెచ్చుకోవడానికి ఇదే రైట్ టైమ్ అని అభి ఎక్కిస్తాడు. యష్ చూసుకుంటున్నాడంటే వేద పట్టించుకోవడం లేదని అర్థం లేదు కదా దీన్ని అడ్డం పెట్టుకుని కూతుర్ని తెచ్చుకునే ఆలోచనలో ఉండమని సలహా ఇస్తాడు.
నీ లైఫ్ లో వేద మాత్రమే పోయింది అనుకున్నా ఖుషి కూడా పోతుందని అనుకోలేదు నువ్వు పిచ్చి వాడివి అయ్యి రోడ్డు మీద అడుక్కోవాలని అభిమన్యు కుట్రలు వేస్తాడు. వసంత్ సంతోషంగా ఇంటికి వచ్చి యష్ సౌత్ ఇండియా బిజినెస్ ఛాంబర్ కి ప్రెసిడెంట్ అయ్యాడని చెప్పేసరికి అందరూ చాలా సంతోషిస్తారు. పేపర్ లో ఫోటో కూడా వచ్చిందని చూపిస్తాడు. అందరూ యష్ కి కంగ్రాట్స్ చెప్తారు. వేద కూడా కంగ్రాట్స్ చెప్తే యష్ మాత్రం మొహం తిప్పుకుంటాడు. ఫంక్షన్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతైనా సౌత్ ఇండియా బిజినెస్ ఛాంబర్ ప్రెసిడెంట్ కి వైఫ్ ని కదా అని సంబరపడుతుంది. డాడీ డ్రెస్ కూడా నువ్వే సెలెక్ట్ చేయాలని ఖుషి చెప్తుంది. వేద సంబరంగా బిజినెస్ పార్టీ కదా ఏదైనా డ్రెస్ కోడ్ ఉంటుందా? మనం ఇద్దరం చేతులు పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళాలి కదా అని మాట్లాడుకుంటే యష్ చిరాకుగా ఆపుతావా నీ ఓవర్ యాక్షన్. ఎక్కువ చేస్తున్నావ్ ఏంటి ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది నాకు దీంట్లో నీకు ఏ సంబంధం లేదని అరుస్తాడు. ఆ మాటకి వేద కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
Also Read: కావ్యని పుట్టింటికి తీసుకెళ్తానన్న రాజ్- నడిరోడ్డు మీద స్వప్న, తప్పించుకున్న రాహుల్
గదిలోకి వచ్చిన తర్వాత యష్ వేద మాటలు తలుచుకుంటాడు. గతంలో యష్ మాళవిక కలిసి అభిమన్యు పార్టీలో జరిగిన విషయం గుర్తు చేసుకుంటాడు. మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుందట ఎవరికి మ్యాచింగ్ వేసుకుంటుంది ఆ వివిన్ గాడిగా. నా కెరీర్ లో ఎంత ఎత్తుకి ఎదిగినా ఇలాగే జరుగుతుంది. అందరికీ గుణపాఠం చెప్పాలి. యష్ పార్టీకి రెడీ అయి వేద లేకుండానే వెళ్లిపోతానని అంటాడు. తను పార్లర్ కి వెళ్ళిందని కాసేపు వెయిట్ చేద్దామని అంటే యష్ వసంత్ మీద కోపంగా అరుస్తాడు. యష్ అటు వెళ్ళగానే వేద వేరే వైపు నుంచి వస్తుంది. వేద వచ్చి ఆయన ఇంకా రాలేదా అంటే యష్ వెళ్లిపోయాడని చెప్పేసరికి బాధపడుతుంది.