Gruhalakshmi April 6th: ట్రయల్ రూమ్‌లో విక్రమ్, దివ్య సరసాలు - నందు, తులసిని చూసి రగిలిపోతున్న లాస్య
విక్రమ్, దివ్య పెళ్లి ఫిక్స్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ప్రియ విక్రమ్ కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అత్తారిల్లు బాగానే ఉందా ఎందుకు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటున్నావ్ ఏదైనా సమస్య ఉందా అని అడుగుతాడు. అమ్మ వైపు నుంచి ఎలాంటి సమస్య ఉందని అంటాడు. కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కాదని ప్రియ చెప్తుంది. తనది అమ్మ పెంపకమని నిజం, అబద్ధం గురించి తెలుసుకోలేని వాడిని కాదని అంటాడు. వెంటనే ప్రియ దివ్యని మీరే రక్షించాలని అనగానే బసవయ్య పూల కుండీ కావాలని కింద పడేస్తాడు. తనని చూసి ప్రియ ఏమి చెప్పకుండా మాట దాటేస్తుంది. విక్రమ్ వెళ్లిపోగానే బసవయ్య వచ్చి దెబ్బలు తింటున్నా బుద్ధి రాలేదు దివ్య గురించి మా ప్లాన్ చెప్పి కాపాడదామనే అది జరగదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నందు కుటుంబం అంతా పెళ్లి బట్టలు కొనేందుకు షాపింగ్ మాల్ కి వస్తారు.
Also Read: కావ్యని పుట్టింటికి తీసుకెళ్తానన్న రాజ్- నడిరోడ్డు మీద స్వప్న, తప్పించుకున్న రాహుల్
షాపులో సిల్క్ సుందరం నందు వాళ్ళకి బట్టలు చూపిస్తూ ఉంటాడు. విక్రమ్ దివ్యకి ఫోన్ చేసి పెళ్లి చీరలు తనే సెలెక్ట్ చేయాలని అంటాడు. షాపింగ్ వస్తానని కాకపోతే దివ్యకి మాత్రమే కనిపిస్తానని చెప్పి ఫోన్ పెట్టేసెసరికి ఖచ్చితంగా ఏదో ఒక రచ్చ జరుగుతుందని అనుకుంటుంది. అందరూ తలా ఒక వైపు వెళ్ళిపోయి చీరలు చూస్తూ ఉంటే నందు, తులసి ఒక దగ్గర కూర్చుంటారు. తల్లిదండ్రులిద్దరూ పక్కపక్కన కూర్చుని షాపింగ్ చేయడం చూసి దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నీ పెళ్లి మూలంగానే వాళ్ళిద్దరినీ ఇలా చూసే అదృష్టం కలిగిందని అనసూయ అంటే.. ఇదే మొదటి సారి చివరి సారని పరంధామయ్య అంటాడు. నందు, తులసి ఇద్దరికీ ఒకే చీర నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే ఎనిమిదో వింత మొదటి సారి భార్యాభర్తలిద్దరికీ ఒకే చీర నచ్చిందని సిల్క్ సుందర అంటాడు. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని కలిసి బతుకుతున్నారని వాళ్ళని పొగుడుతాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాడు. ఆ మాటకి నందు సంతోషపడితే తులసి మాత్రం మేము భార్యాభర్తలం కాదు జస్ట్ ఫ్రెండ్స్ అని కోపంగా చెప్తుంది. దీంతో నందు మొహం మాడిపోతుంది.
Also Read: కీలక మలుపు, పశ్చాత్తాపంతో కుమిలిపోయిన విన్నీ- వేద, యష్ ని ఒక్కటి చేస్తాడా?
ఇక్కడ ఉంటే ప్రాబ్లం అని వాళ్ళ దగ్గర నుంచి జారుకుని పరంధామయ్య వాళ్ళ దగ్గరకి వస్తాడు. వాళ్ళు ఫ్రెండ్స్ కాదు మా కొడుకు, కోడలని చెప్తారు. విక్రమ్ దివ్య కోసం ఎదురుచూస్తూ ఉంటే సిల్క్ సుందరం మధ్యలో దూరతాడు. లాస్య దగ్గరకి వచ్చి క్రేజీ కపుల్ అద్భుతంగా ఉన్నారు వాళ్ళ మధ్య ప్రేమ కళ్ళలో కనిపిస్తుందని తెగ మెచ్చుకుంటాడు. అది ఎవరని లాస్య అడిగేసరికి నందు, తులసిని చూపిస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి లాస్య రగిలిపోతుంది. వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటో అర్థం కాక సిల్క్ సుందరం పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుకుంటాడు. విక్రమ్ మెల్లగా ఎవరికీ కనిపించకుండా దివ్యని పిలుస్తూ ఉంటాడు. దివ్య తనవైపు చూడటం కోసం పక్కనే ఉన్న పూలు విసురుతూ ఉంటాడు కానీ దివ్య మీద తప్ప అనసూయ, పరంధామయ్య వాళ్ళకి తగులుతాయి.