Ennenno Janmalabandham April 6th: కీలక మలుపు, పశ్చాత్తాపంతో కుమిలిపోయిన విన్నీ- వేద, యష్ ని ఒక్కటి చేస్తాడా?
వేద మాటలకు విన్నీ తన మనసు మార్చుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద ఖుషితో నవ్వుతో మాట్లాడుతుంటే యష్ కోపంగా వచ్చి తనని పక్కకి లాగేస్తాడు. ఖుషి విషయంలో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు నేనే తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పేసరికి వేద చాలా బాధపడుతుంది. రోజు ఖుషిని రెడీ చేసి స్కూల్ కి తీసుకువెళ్ళేది అని వేద అంటే ఇంతకముందు వేరు ఇప్పుడు వేరు నా కూతురి విషయంలో పరాయి వాళ్ళ జోక్యం అనవసరమని యష్ అంటాడు. ఎందుకు ఇలా ఉన్నావ్, ఎందుకు మారిపోయావని మాలిని నిలదీస్తుంది. చూడు వేద ఎలా ఫీల్ అవుతుందో అంటే కలల ముందు కనిపించేవి నిజాలు కావు, చెప్పే మాటలు వేరు చేసే పనులు వేరు మాటల్లో ఒకటి మనసులో ఒకటి అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు అనేసి వెళ్లబోతుంటే వేద అడ్డంగా నిలబడుతుంది.
ఏవండీ ఏమైంది మీకు ఎందుకు ఇలా ప్రవరిస్తున్నారని వేద అడుగుతుంది. నా వల్ల తప్పు జరిగిందా మీ పట్ల తప్పుగా ఏమైనా ప్రవర్తించానా కారణం చెప్పమని అంటుంది.
వేద: మీ భార్యగా అడిగే అర్హత నాకు లేదా భర్తగా చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా
Also Read: బిల్డర్ మధు హత్య చేయడం చూసిన జానకి- నిజం బయట పెట్టొద్దన్న మనోహర్
యష్: భార్య, భర్త ఇవన్నీ ఒక భ్రమ. తెలియక ఒక్కసారి మోసవపోవచ్చు. తెలిసి తెలిసి మరొకసారి మోసపోవడానికి నేనేమీ మూర్ఖుడిని కాదు అనేసి వెళ్ళిపోతాడు. ఆ మాటలకి వేద మనసు ముక్కలవుతుంది.
కళ్ళలో పెట్టుకుని చూసుకోవాల్సిన వేదని ఎందుకు ఇలా బాధపెడుతున్నాడాని మాలిని బాధపడుతుంది. ఇంట్లో అందరూ వేదని ఓదార్చడానికి చూస్తారు. ఆయన మాటలకు బాధగా లేదు కానీ ఒక్క మాట చాలా బాధగా అనిపిస్తుంది. నేను పరాయి దాన్నా, ఖుషి నాకు పరాయిదా, తనని వదిలేయాల్సి వస్తే ముందు నా ప్రాణం వదిలేస్తానని వేద ఏడుస్తుంది. నా బిడ్డ, భర్త నాకే సొంతం ఇప్పటికీ ఎప్పటికీ అని వేద అంటుంది.
విన్నీ వేద ఫోటో ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. వేద మాటలన్నీ గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఏంటి ఇది నాకు ఏమైంది నిన్ను తాకడానికి ఎందుకు నా చేతులు నీ మీదకు రాలేదు. ఎందుకు ఈరోజు నువ్వు నాకు ఒక పసి పాపలాగా కనిపించావు. పెళ్ళైన ఆడడానిలో ఒక తల్లిని చెల్లిని చూడమన్నారు కానీ కనీసం నేను ఒక ఫ్రెండ్ ని కూడా చూడలేకపోయాను ఎంత నీచుడిని నేను. మీ ఇద్దరినీ విడగొట్టడానికి ఎంత కుట్ర చేశాను. నీ జీవితంలో లేని సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చానా? లేదంటే సంతోషాన్ని పోగొట్టడానికి వచ్చానా? నేను నీ లైఫ్ లో హీరోనా లేదంటే విలన్ నా, ఫ్రెండ్ నా.. నన్ను బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్ కదా ఆ మాటకి అవమానం నేను. ఎంత నమ్ముతూ గౌరవిస్తున్నావ్. నీ భర్తని నీ నుంచి వేరు చేయాలని కుట్ర చేస్తుంటే నువ్వు నన్ను నీ భర్తని కలపమని నా దగ్గర మాట తీసుకున్నావ్. ఎంత తప్పు చేశాను. ఈ క్షణం నుంచి నేను నీ స్నేహితుడి, శ్రేయోభిలాషిని మాట ఇస్తున్నా. నీ కోసం నీ మంచి కోసం ఆలోచిస్తాను నీకు అండగా నిలుస్తాను. నీ జీవితం నీదే నీ యశోధర్ నీవాడే. నీకు ఎలాంటి హాని జరగదు, జరగనివ్వడు. నీకు మాట ఇస్తున్నా నీ కళ్ళలో నీళ్ళు రానివ్వను అని రియలైజ్ అవుతాడు.
Also Read: మనసుల్ని మెలిపెట్టేసిన నందు- విక్రమ్ కి నిజం చెప్పడానికి ట్రై చేస్తున్న ప్రియ
ఖుషి డల్ గా కూర్చోవడం చూసి ఏమైందని అంటే మమ్మీ మీద ఎందుకు అరిచావని అడుగుతుంది. మమ్మీకి నువ్వు నేను అంటే బోలెడు ఇష్టమని చెప్తుంది. కానీ యష్ మాత్రం మీ అమ్మ మారిపోయిందని మనసులో అనుకుంటాడు. ఖుషిని స్కూల్ లో డ్రాప్ చేసి వెళ్లబోతుంటే మాళవిక యష్ ని పిలుస్తుంది.