Brahmamudi April 6th: కావ్యని పుట్టింటికి తీసుకెళ్తానన్న రాజ్- నడిరోడ్డు మీద స్వప్న, తప్పించుకున్న రాహుల్
కావ్య, రాజ్ కి పెళ్లి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్యని రాజ్ ఈడ్చుకొచ్చి ఇంట్లో పడేసి చెడామడా తిడతాడు. ఎందుకు ఈ ఆవేశమని కావ్య ఎదురు ప్రశ్నిస్తుంది. నేను ఏం నేరం చేశానో నిరూపించమని అడుగుతుంది. నేనే సాక్షిని నా కళ్ళే సాక్ష్యమని చెప్తాడు. వీళ్ళ అక్క ఎక్కడ ఉందో తెలుసు కదా నేను వెళ్లకముందే తాను స్వప్నకి చెప్పి తనని తప్పించేసిందని చెప్తాడు.
రాజ్: మీ అక్క అంటే నీకు అసూయ అందుకే తనని తప్పు చేసి నువ్వు తాళి కట్టించుకున్నావ్. తప్పు చేసింది స్వప్న కాదు నువ్వు
కావ్య: ఏం మాట్లాడుతున్నారు అది అమాయకురాలని ఎవరో తప్పు దారి పట్టించారని, దాని జీవితాన్ని కాపాడి బుద్ధి చెప్పాలని అనుకున్నా. ఏ చెల్లి అయినా అక్క జీవితం నాశనం చేయాలని అనుకుంటుందా. నా జీవితాన్ని నేనే ఎందుకు చిన్నాభిన్నం చేసుకుంటాను. దిక్కులేని పక్షిలాగా ఎందుకు స్టోర్ రూమ్ లో ఉంటాను
రాజ్: అదంతా నటన ఎవరూ నమ్మకండి. పెళ్లి నుంచి స్వప్న వెళ్లిపోలేదు తనే తప్పించేసింది. తనని నేను పట్టుకుంటే ఎక్కడ తన గురించి బయటపడుతుందో అని భయపడి తప్పించేసింది
ఇంద్రాదేవి: అక్క కోసం ఆరాటపడుతుంటే తను ఎందుకు తప్పు చేస్తుంది
Also Read: కీలక మలుపు, పశ్చాత్తాపంతో కుమిలిపోయిన విన్నీ- వేద, యష్ ని ఒక్కటి చేస్తాడా?
రాజ్: అదంతా నటన నేను తీసుకొస్తానని చెప్పాను కదా అయినా హోటల్ కి ఎందుకు వచ్చింది
ఇంట్లో అందరూ కావ్య తప్పు చేసిందని అపార్థం చేసుకుని తలా ఒక మాట అంటారు. నిజంగా ఏ తప్పు చేయలేదని కావ్య చెప్తున్నా కూడా రాజ్ వినిపించుకొడు. ఎందుకొచ్చావని అంటే నేను దుగ్గిరాల ఇంటి కోడలిని మీకు ఆవేశం వస్తే ముందు వెనుకా ఆడపిల్ల అని కూడా చూడరు. ఈ దుగ్గిరాల ఇంటి వారసుడి రోడ్డు ఎక్కి ఆడపిల్లని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? మీతో పెళ్లి ఇష్టం లేదని వెళ్లిపోయిందని నిజం బయట వాళ్ళకి తెలిస్తే పోయేది ఎవరు పరువు. అప్పుడు ఎవరి ఇంటికి మచ్చ వస్తుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నా ఇల్లు. ఇది నా వంశం. ఈ వంశ పరువు మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే ఆ గొడవ ఆపాలని అక్కడకి వచ్చాను. గొడవ పడటానికి మా అక్క లేదని తెలిసింది. మీకు కంట పడితే ఇలాగే గొడవ చేసి రచ్చ చేసి మాటలు అంటారని తెలిసి తప్పించుకోవాలని అనుకున్నాను. తప్పు చేసింది మీరు మా అక్క చేతిలో దగా పడ్డారు. అందుకు చాలా బాధగా అనిపించింది. దయచేసి నన్ను దోషిని చేయకండి. ఇంతమంది ముందు నన్ను నేల మీదకి తోసేసి అవమానించారు. నన్ను నన్నుగా నాకు దానం చేయండని బాధపడుతుంది.
Also Read: బిల్డర్ మధు హత్య చేయడం చూసిన జానకి- నిజం బయట పెట్టొద్దన్న మనోహర్