అన్వేషించండి

ఈ దీపావళి చిత్రాల్లో ఏవి పేలాయ్? ఏవి తుస్సుమన్నాయ్?

ఈసారి దీపావళి కి తెలుగు లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి జిన్నా, ప్రిన్స్, ఓరి దేవుడా, సర్దార్. ఈ నాలుగు సినిమాలకి పబ్లిక్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

పండుగలు వస్తున్నాయంటే.. సినిమాలు థియేటర్లలో క్యూకడతాయి. ఈసారి దీపావళికి కూడా సినిమాల సందడి మొదలైంది. ఈ నెల 24 (సోమవారం) దీపావళి కావడంతో నాలుగు రోజులు ముందే సినిమాలు రీలీజ్ అయ్యాయి. దీపావళి బరిలో ఈసారి నాలుగు సినిమాలు దిగాయి. అవే 'ప్రిన్స్', 'జిన్నా', 'ఓరి దేవుడా', 'సర్దార్'. ఈసారి దీపావళి కి భారీ సినిమాలు లేకపోవడంతో మిడ్ బడ్జెట్ సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ శుక్రవారం(21-10-22) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో మొదటి రోజు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూసేద్దాం రండి.

ప్రిన్స్ ఎలా ఉంది?: ముందుగా 'ప్రిన్స్' సినిమా గురించి మాట్లాడకుందాం. జాతిరత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్నారు డైరెక్టర్ అనుదీప్ కెవి. ఆ సినిమా తర్వాత ఎవరా అనుదీప్ అని చాలా మంది గూగూల్ లో సెర్చ్ చేశారు కూడా. అంతలా వినిపించింది ఆయన పేరు. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వస్తోన్న సినిమా, అందులోనూ తమిళ్ యువ హీరో శివకార్తికేయన్ హీరో కావడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. తీరా సినిమా విడుదల అయ్యాక అనుకున్నంతగా సినిమాలో ఏమి లేకపోవడంతో పెదవి విరిచారు ప్రేక్షకులు. శివకార్తికేయన్ నటన బాగున్నా తెలిసిన కథలా ఉండటం, పంచ్ లు పేలకపోవడం, కొత్తదనం లేకపోవడంతో ఎప్పుడు జాతిరత్నాలే తీస్తే ఎలా అనే విమర్శలు వస్తున్నాయిప్పుడు. 

Also Read: 'ప్రిన్స్' రివ్యూ : శివకార్తికేయన్, 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా ఎలా ఉందంటే?

ఓరి దేవుడా.. ఫ్యామిలీకి ఒకే: ఇక లిస్ట్ లో రెండో సినిమా 'ఓరి దేవుడా' సినిమా. మల్టీస్టారర్, వెంకటేష్ లాంటి హీరోలు నటించడం, సూపర్ హిట్ సినిమా రిమేక్ ఇవీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. దీని ఒరిజినల్ వెర్షన్ 'ఓ మై కడవులే' తమిళ్ లో సూపర్ హిట్. అయితే తెలుగులో ఈ సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకున్నా.. బాక్స్ ఆఫీసు వద్ద అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. సినిమాలో స్టోరీ బానే ఉన్నా ఫస్ట్ ఆఫ్ లో సాగదీత సన్నివేశాలు, సరైన డైలాగ్స్ లేకపోవడం, క్లైమాక్స్ లో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి. వెంకటేష్, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ ఆఫ్ లో ఎమోషన్ సీన్స్ తో సినిమా పర్లేదనిపిస్తోంది. ఈ దీపావళికి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

Read Also: ‘ఓరి దేవుడా’ ఆడియన్స్ రివ్యూ - ఊహించని స్పందన!

‘జిన్నా’ ఫన్నా? ఫ్రస్ట్రేషనా?: 'జిన్నా' సినిమా విషయానికొస్తే.. ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు జిన్నా తో దీపావళి టాపర్ గా నిలుద్దామనుకున్నారు. ట్రైలర్ బాగుండటం, సన్నీ లియోన్ లాంటి యాక్టర్స్ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యాక టాక్ మారిపోయింది. సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ఉన్నా అవి అంతగా ఎంగేజ్ చేయలేకపోయాయి. విరామ సన్నివేశాలు, సెకండ్ ఆఫ్ పర్లేదనిపించినా.. రొటీన్ గా సాగే ప్రథమార్థం, కామెడి పాళ్లు తక్కువవడం, అర్దాంతర ముగింపు వలన సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఈ దీపావళికి నిలవడం కష్టమే అనిపిస్తోంది.

Also Read: జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?

'సర్దార్' సేవ్ అయినట్లే: హీరో కార్తీ కి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అందుకే సర్దార్ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్ లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. తెలుగులో స్పై యాక్షన్ చిత్రాలు కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాలో దర్శకుడు తీసుకున్న సబ్జెక్టు, ప్రత్యర్థుల ఎత్తులకు హీరో వేసే పైఎత్తులు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కార్తీ నటన, ఎమోషన్ సీన్స్, పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు ఉన్నా ఓవరాల్ గా సినిమా పర్లేదనిపించింది. 

Also Read: సర్దార్ రివ్యూ: బాటిల్ నీళ్లు తాగాలంటే భయపెట్టే సినిమా - కార్తీకి హ్యాట్రిక్ ఇచ్చిందా?

మొత్తంగా ఈ దీపావళి కి బరిలో దిగిన నాలుగు సినిమాల్లో మొదటిరోజు ఓరి దేవుడా, సర్దార్ సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా మిగతా సినిమాలకు మిశ్రమ స్పందన వస్తోంది.  అయితే రెండుమూడు రోజుల తర్వాత ఈ టాక్ మారే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఈసారి పండక్కి ఏ సినిమా టాపర్ గా నిలుస్తుందో తెలియాలంటే దీపావళి వరకూ ఆగాల్సిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget