Ori Devuda Audience Review: ‘ఓరి దేవుడా’ ఆడియన్స్ రివ్యూ - ఊహించని స్పందన!
ఊర మాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఓరి దేవుడా..!’. ఈ మూవీ ఇవాళ(అక్టోబర్ 21న) విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించిన సినిమా ‘ఓరి దేవుడా..!’. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆశాభట్, మిథిలా పాల్కర్ హీరోయిన్స్‌గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా ఇవాళ విడుదల అయ్యింది. తమిళ సినిమా పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ‘ఓ మై కడవులే’ సినిమా తెలుగులో ‘ఓరి దేవుడా..!’ పేరుతో రీమేక్ అయ్యింది. తమిళ సినిమాలో దేవుడి క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేస్తే, తెలుగులో అదే పాత్రలో వెంకటేష్ నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించాయి. సినిమాపై ఓరేంజిలో అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ‘ఓరి దేవుడా..!’ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా ఏ రివ్యూ ఇస్తున్నారో చూద్దాం.
‘ఓ మై కడవులే’ చూసిన వారినీ ఆకట్టుకుంటుంది!
‘ఓరి దేవుడా..!’ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే తొలి షో పడింది. ఈ మూవీని చూసిన ఆడియెన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథ ఎలా ఉంది? దర్శకుడు కథను ఎలా మలిచాడు? సినిమాకు రేటింగ్ ఎంత ఇవ్వొచ్చు? అనే విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. చాలా మంది ఈ సినిమా గురించి పాజిటివ్ గానే రివ్యూ ఇస్తున్నారు. విశ్వక్ షేన్ నటన చాలా బాగుంది అంటున్నారు. తమిళ సినిమా ‘ఓ మై కడవులే’ చూసినా, ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందంటున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ అద్భుతంగా కుదిరిందంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడానికి మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని చెప్తున్నారు. ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇస్తున్నారు.
ఫస్టాఫ్ కామెడీ, సెకెండాఫ్ ఎమోషన్స్
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పెళ్లి అయిన కొంత కాలం తర్వాత భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయి. వారిద్దరూ విడిపోవడానికి కోర్టు మెట్లు ఎక్కుతారు. అదే సమయంలో వారి జీవితంలోకి దేవుడు వస్తాడు. ఆ తర్వాత వీరి విడాకుల కథ ఎటు మలుపు తిరుగుతుంది? వారి సమస్యను దేవుడు క్లియర్ చేస్తాడా? అనేదే ఈ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా తొలి భాగం ఫుల్ కామెడితో సాగుతుందని, రెండో భాగం ఔట్ అండ్ ఔట్ ఎమోషన్ గా ఉంటుందని ఆడియెన్స్ చెప్తున్నారు. ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చంటున్నారు.
#Sardar superhit reports ..#OriDevuda hit reports ...#Prince avg reports ..
— Çhatterbøx (@balvk99) October 21, 2022
#OriDevuda Venky anaa energy level peaks aba💥💥💥💥💥💥💥💥💥💥 pic.twitter.com/6X1u8CZhsY
— venky arjun naidu (@Naidu23440191) October 21, 2022
Congratulations to team #OriDevuda for Scoring BlockBuster. Heartily Wishes From #ManOfMassesRamCharan Fans ❤🔥 pic.twitter.com/G4D6OGPYie
— Demolish RC Haters (@TeamDRHTweets) October 21, 2022
#OriDevuda Decent reports and getting positive talk 👌
— vinay ! !!!!! (@VinayKu54989477) October 21, 2022
.
Superb first half @VishwakSenActor👍🏻 characters are well written with strong performances #OriDevuda
— NTR30 (@kiran_nine) October 21, 2022
Liked it. A well-rounded screenplay but there's a catch. The last act becomes dated and predictable. There's even some meta humor thrown in the end but doesn't help much. #OriDevuda
— No Woman No Cry (@Kamal_Tweetz) October 21, 2022
#OriDevuda Decent watch though already watched OMK. @VishwakSenActor is very good in his role. Biggest asset is @leon_james Music which is better than Tamil version. He is the hero of the film. @Dir_Ashwath Well done 👍🏻
— Dead Air Space (@DeadAirSpaces) October 21, 2022
#OriDevuda Overall A Pretty Decent Rom-Com with a Passable 1st half and Good 2nd Half!
— Venky Reviews (@venkyreviews) October 21, 2022
First half is passable and could’ve had better comedy but the heart of the film is the emotion in the later part which works very well along with good music. Easy One-Time Watch.
Rating: 3/5