అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ginna Movie Review: జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?

మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ : జిన్నా
రేటింగ్ : 2/5
నటీనటులు : మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్, వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు
ఛాయాగ్రహణం : ఛోటా కె.నాయుడు
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత : మోహన్ బాబు
స్క్రీన్ ప్లే : మోహన్ బాబు
దర్శకత్వం : ఈషాన్ సూర్య
విడుదల తేదీ: అక్టోబర్ 21, 2022

మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. 2016లో వచ్చిన ‘ఈడోరకం ఆడోరకం’ తర్వాత విష్ణుకు మళ్లీ హిట్ లభించలేదు. వరుసగా ఐదు పరాజయాల తర్వాత వస్తున్న ‘జిన్నా’ విష్ణు కెరీర్‌కు ఎంతో కీలకమైన సినిమా. కొత్త దర్శకుడు ఈషాన్ సూర్య ఈ సినిమాను తెరకెక్కించాడు. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ వంటి అందాల తారలు,  వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, సద్దాం వంటి కమెడియన్లు ఈ సినిమాలో నటించారు. టీజర్, ట్రైలర్లు కూడా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. యాక్షన్, హార్రర్, కామెడీ సినిమాగా దీన్ని రూపొందించామని మంచు విష్ణు తెలిపారు. మరి విష్ణు కోరుకున్న హిట్ ఈ సినిమాతో అయినా దొరికిందా?

కథ: జిన్నా (మంచు విష్ణు) రంగంపేటలో టెంట్ హౌస్ నడుపుతూ ఉంటాడు. తన చిన్ననాటి స్నేహితురాలు పచ్చళ్ళ స్వాతి (పాయల్ రాజ్ పుత్)ని ప్రేమిస్తాడు. జిన్నాకు ఊరంతా అప్పులు కూడా ఉంటాయి. అయితే నెల రోజుల్లో వాటిని తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న జిన్నాకు మరో చిన్నప్పటి స్నేహితురాలు రేణుక(సన్నీ లియోన్) ఊరికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే రేణుక కూడా జిన్నాని ప్రేమిస్తుంది. అప్పు తీర్చటం కోసం జిన్నా కోటీశ్వరురాలు అయిన రేణుకని ప్రేమించినట్లు నటిస్తాడు. ఉన్నట్లుండి ఒకరోజు రేణుక వింతగా ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: మొదటి నుంచి ఈ సినిమాను హార్రర్ కామెడీగా ప్రచారం చేశారు. కానీ నిజానికి జిన్నా సైకలాజికల్ థ్రిల్లర్. సాధారణంగా ఇలాంటి సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ జిన్నాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బదులు యాక్షన్, కామెడీలతో డీల్ చేయాలని ప్రయత్నించారు. ప్రథమార్థం అయితే మరీ 90ల నాటి సినిమా చూసినట్లు అనిపిస్తుంది. తనను కొట్టడానికి వచ్చిన రౌడీలతో ‘నన్ను ట్రోల్ చేస్తే భరిస్తాను. నా వాళ్ల జోలికొస్తే మాత్రం వదలను.’ అంటూ విష్ణు పర్సనల్ లైఫ్‌ను కూడా టచ్ చేశారు. హీరోయిన్లు ఇద్దరితో శక్తిమేర గ్లామర్ షో చేయించారు.

సెకండాఫ్‌ను కొంచెం డిఫరెంట్‌గా డీల్ చేసే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కొంచెం నవ్విస్తాయి. సస్పెన్స్‌ను రివీల్ చేసిన దగ్గర నుంచి సినిమా రేసీగా వెళ్తుంది. నిజానికి ఇలాంటి లైన్‌ను యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్‌తో కాకుండా థ్రిల్లర్‌లా రాసుకుని ఉంటే బాగుండేది. క్లైమ్యాక్స్‌లో మళ్లీ సీక్వెల్‌కు హింట్ ఇచ్చారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే... జిన్నా లాంటి పాత్రలు చేయటం మంచు విష్ణుకి కొత్తేమీ కాదు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి క్యారెక్టర్ల మీటర్ లోనే జిన్నా కూడా ఉంటుంది. సన్నీ లియోన్ ను ఇలాంటి పాత్రలో చూడటం తెలుగు ప్రేక్షకులకు కొత్త ఏమో కానీ బాలీవుడ్ లో చాలా సార్లు ఇలానే కనిపించింది. పాయల్ రాజ్ పుత్ బాగానే నటించింది. మిగతా పాత్రలో కనిపించిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘నమ్మకం లేని ప్రేమ, కర్రలు లేని టెంటు నిలబడవు.’ సినిమాలో వచ్చే కామెడీ సీన్‌లో మంచు విష్ణు డైలాగ్ ఇది. సరైన స్క్రిప్టు లేని సినిమా కూడా నిలబడదని దర్శక నిర్మాతలు తెలుసుకుని ఉండాల్సింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget