అన్వేషించండి

Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్

రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు.

Director Shankar About Ram Chran: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ ఎన్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు 2’ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ మూవీ విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. హీరో కమల్ హాసన్ తో కలిసి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి రామ్ చరణ్ గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

అతడితో వర్క్ చేయడం డిఫరెంట్ గా ఉంది- శంకర్

పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి మరో 10, 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ‘భారతీయుడు 2’ సినిమా విడుదలైన వెంటనే మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేస్తాం. ఆ పనులు కంప్లిట్ అయ్యాక సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయాన్ని వెల్లడిస్తాం. ఈ మూవీని వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ప్రయత్నిస్తాం” అని చెప్పారు. రామ్ చరణ్ తో కలిసి పని చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “ఆయనతో పని చేయడం డిఫరెంట్ గా ఉంది. అయినా, నేను ఎంజాయ్ చేశాను” అని వెల్లడించారు.

‘గేమ్ ఛేంజర్’ గురించి..

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఎస్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నది. అంజలి, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, జయరామ్, సునీల్, సముద్రఖని సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘జిగర్తాండ’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో  ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. అటు శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు 2’ సినిమా జులై 12న విడుదలకానుంది. మరో 6 నెలల్లో ‘భారతీయుడు 3’ కూడా విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.  

Also Read: విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?

Read Also: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Embed widget