అన్వేషించండి

Lakshmi Manchu: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ

న‌టి మంచు ల‌క్ష్మీ.. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను అంద‌రితో పంచుకుంటారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూ వైర‌ల్ అవుతుంది.

Ram Charan, Allu Arjun, Rana Daggubati have a Group: న‌టి మంచు ల‌క్ష్మీ. మోహ‌న్ బాబు కూతురైన‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలోకి త‌న టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈమె ముంబైలో ఉంటున్నారు. పాప గ్రోత్ కి, త‌న ఎక్స్ పోజ‌ర్ కి ఆమె బాంబే షిఫ్ట్ అయిన‌ట్లు చెప్పారు. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లు టాక్ న‌డిచింది. ఇదిలా ఉంటే మంచుల‌క్ష్మీ ఈ మ‌ధ్య బాలీవుడ్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాలు పంచుకున్నారు. త‌ను యాక్టింగ్ కెరీర్ లోకి ఎలా వ‌చ్చాను? ఏంటి అనే చాలా విష‌యాలు చెప్పింది.

చిన్న‌ప్పుడే యాక్ట‌ర్ అవ్వాల‌నుకున్నా.. 

త‌న‌కు 5 ఏళ్లు ఉన్న‌ప్పుడే యాక్ట‌ర్ అవ్వాల‌నే కోరిక క‌లిగింద‌ని, అది చెప్పేందుకు ఇప్పుడు టైం వ‌చ్చింద‌ని అన్నారు మంచు ల‌క్ష్మీ. హీరోల కూతుళ్లు అప్ప‌టికి ఎవ్వ‌రూ సినిమాల్లోకి రాలేద‌ని, అందుకే త‌ను చెప్ప‌లేక‌పోయిన‌ట్లు అన్నారు. అది ఇప్పుడు మారాల‌ని, దాని గురించి అంద‌రూ మాట్లాడాలి అంటూ తను యాక్టింగ్ లోకి రావ‌డంపై మాట్లాడారు మంచు ల‌క్ష్మీ. ఈ విష‌యాలు మాట్లాడుతూనే.. ఆమె లేటుగా ఎందుకు యాక్టింగ్ వైపు వ‌చ్చారో కూడా చెప్పుకొచ్చారు. మంచుల‌క్ష్మీ అమెరికాలో చదువుకున్న విష‌యం తెలిసిందే. నిజానికి ఇక్క‌డ ఉంటే త‌న‌కు పెళ్లి చేసేస్తార‌నే ఉద్దేశంతోనే అమెరికా వెళ్లిపోయాన‌ని చెప్పారు ఆమె. త‌న ఫ్రెండ్స్ యాక్టింగ్ లోకి ఎంట‌ర్ అయ్యి ఇబ్బంది ప‌డ్డార‌ని, అలా కాకుండా ఉండాల‌ని వెళ్లిపోయాన‌ని అన్నారు. 

"నా ఫ్రెండ్ 'అక్క‌డ‌మ్మాయి ఇక్క‌డ‌బ్బాయి' హీరోయిన్ సుప్రియ, నాగార్జున గారి కోడ‌లు, నాగేశ్వ‌ర‌రావు గారి మ‌న‌వ‌రాలు హీరోయిన్ గా చేసింది. అప్పుడు ఆమెకు చాలా ఇబ్బందులు ఎదుర‌య్యాయి. వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా మాట‌లు ప‌డ్డారు. మంజుల గారు చాలా మంచి యాక్ట‌ర్. ఆమె సినిమా చేసిన‌ప్పుడే అంతే మాట‌లు ప‌డ్డారు. దానివల్ల ఇంట్లో వాళ్లు కూడా ఆలోచిస్తారు క‌దా? త‌ర్వాత సినిమా చేయించేందుకు. దాంతో వాళ్లు అలా ఆగిపోయారు. నేను అలా అవ్వ‌కూడ‌దు అనుకున్నాను. ఇక్క‌డే ఉంటే పెళ్లి చేసేస్తార‌నే ఉద్దేశంతో అమెరికా వెళ్లిపోయాను. ఇప్పుడు ఇలా యాక్ట‌ర్ గా చేస్తున్నాను అని చెప్పారు మంచు లక్ష్మీ. 

డిస్నీలో ఆ పాత్ర చేసిన ఏకైక ఇండియ‌న్ యాక్ట‌ర్..

త‌న యాక్టింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఆమె చేసిన ఒక క్యారెక్ట‌ర్ గురించి చెప్పారు మంచు ల‌క్ష్మీ. డిస్నీ వాళ్లు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో లేడీ డెవిల్ క్వీన్ గా న‌టించిన ఏకైక ఇండియ‌న్ యాక్ట‌ర్ త‌నే అని చెప్పారు. సినిమా చూసి వ‌చ్చి త‌న తండ్రి త‌న‌కు సెల్యూట్ చేశాడ‌ని అది మ‌ర్చిపోలేని మూమెంట్ అన్నారు ఆమె. ఆ క్యారెక్ట‌ర్ కి చాలా చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, నాన్న అలా మెచ్చుకోగానే తాను ఆ క‌ష్టాన్ని మ‌ర్చిపోయాన‌ని చెప్పారు ఆమె. "నిజానికి ఆ క్యారెక్ట‌ర్ చేయ‌మ‌ని రాఘ‌వేంద్ర‌రావు గారి అబ్బాయి ప్ర‌కాశ్ చెప్పిన‌ప్పుడు నేను ఫోజ్ కొట్టాను. నేను హీరోయిన్ క్యారెక్ట‌ర్ చేయ‌ను అన్నాను. త‌ర్వాత ఆలోచిందిచ ఓకే చెప్తే ఆ క్యారెక్ట‌ర్ వేరేవాళ్ల‌కి ఇచ్చేశారు. అవ‌త‌లి వాళ్లు డ్రాప్ అయితే నీకు ఇస్తారు అన్నారు. దీంతో అంద‌రి దేవుళ్ల‌ను ప్రార్థించాను నాకే ఆ క్యారెక్ట‌ర్ రావాల‌ని. అలా లేడీ డెవిల్ క్వీన్ గా చేసి ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాను" అని చెప్పారు ల‌క్ష్మీ.   

అమ్మ ఎప్పుడూ అలా చూడ‌లేదు.. 

నాన్న అంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటారు అన్నారు. మ‌రి అమ్మ? ఈమె మీకు స్టెప్ మ‌ద‌ర్ క‌దా? అని అడిగిన ప్ర‌శ్న‌కి మంచు ల‌క్ష్మీ ఇలా స‌మాధానం చెప్పారు. ఆమె ఎప్పుడూ మాకు అమ్మ కాదు అనే ఫీలింగ్ రాలేదు అని చెప్పారు. ఆమె అలా పెంచింద‌ని, ఈ విష‌యం ఎప్పుడూ మాట్లాడాలి అని తాను అనుకోనని అన్నారు ఆమె. 

మా అంద‌రికీ వాట్సాప్ గ్రూప్.. 

ఇక టాలీవుడ్ లో ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కి ఆమె ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పింది. తాము అంతా ఎప్పుడూ కాంటాక్ట్ లో ఉంటామ‌ని చెప్పుకొచ్చారు. "మా అంద‌రికీ వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో దాదాపు 140 మంది యాక్ట‌ర్స్ ఉంటాం. సినిమాల గురించి, ట్రైట‌ర్స్, టీజ‌ర్స్ ఏది రిలీజైన దాంట్లో పోస్ట్ చేసి అంద‌రం షేర్ చేస్తాం. అలా ఒక‌రికి ఒక‌రు స‌పోర్ట్ గా ఉంటాం" అని చెప్పారు మంచు లక్ష్మీ.    

Also Read: విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ 8లో వేణు స్వామి - భారీ పారితోషికం డిమాండ్
తెలుగు బిగ్ బాస్ 8లో వేణు స్వామి - భారీ పారితోషికం డిమాండ్
Team India: 16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు, ప్రపంచం మొత్తం మీద 30 మాత్రమే ఉన్నాయట
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు, ప్రపంచం మొత్తం మీద 30 మాత్రమే ఉన్నాయట
Bonalu in Hyderabad 2024: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
Embed widget