అన్వేషించండి
Advertisement
Ravi Teja: 'రవితేజ' చీప్, ఆమె వ్యాఖ్యలు పబ్లిసిటీ స్టంటా?
'దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ అని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధమైంది' అంటూ రవితేజపై కామెంట్స్ చేసింది రమేష్ వర్మ భార్య.
రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమా ఫిబ్రవరి 11న విడుదలైంది. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. రవితేజ ఫ్యాన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తుంటే.. ఒకట్రెండు సీక్వెన్స్ లు తప్ప సినిమాలో ఇంకేమీ లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. అయితే ఈ సినిమా మేకింగ్ విషయంలో హీరోకి, డైరెక్టర్ కి పొసగలేదనే మాటలు వినిపించాయి.
దానికి తగ్గట్లే హీరో రవితేజ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణను ఉద్దేశిస్తూ.. 'మీరు దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాలి.. కానీ మీకు అన్నీ తెలియవు' అంటూ చెప్పారు. అంతేకాదు.. 'ఖిలాడి' సినిమా గనుక హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం టెక్నికల్ టీమ్ కి చెందుతుందని.. అలాంటి టీమ్ ను దర్శకుడు రమేష్ వర్మకి 'అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు నిర్మాత ఇచ్చాడని' రవితేజ అన్నారు.
అదృష్టంపై తనకు నమ్మకం లేదని.. కానీ రమేష్ వర్మను చూస్తే నమ్మాల్సి వస్తుందని వెటకారంగా ఉన్నారు. అక్కడితో ఆగలేదు.. 'పుష్ప సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేసిన శ్రీకాంత్ విస్సాని తనకి పరిచయం చేసినందుకు మాత్రమే దర్శకుడు రమేష్ వర్మకి థాంక్స్ చెబుతున్నానని' అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రమేష్ వర్మ భార్య మండిపడింది.
'అరటిపండ్లు మీకు బాగా వచ్చు అనుకుంట తీయడం. డైరెక్టర్ గారు నెక్స్ట్ టైం క్లాసెస్ తీసుకోండి RT దగ్గర. అరటిచెట్టు నరికి ఇచ్చినా సరిపోలేదు RTకి. డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది అది మీకు చెప్పి చేయిస్తేనే కెమెరాలో యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తావ్.క్రెడిట్ గోస్ టు డైరెక్టర్', 'దర్శకుడు అజయ్ భూపతి చీప్ స్టార్ అని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధమైంది' అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఈ విషయంలో రవితేజ ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేశారు. పబ్లిసిటీ కోసమే ఆమె రవితేజపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటూ మండిపడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
న్యూస్
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion