అన్వేషించండి

Devatha October 31th: ఆదిత్య గుట్టు బయటపెట్టేందుకు రంగంలోకి దేవుడమ్మ- కన్నతండ్రి మీద ప్రేమ చూపించిన దేవి

ఆదిత్య బుక్ లో రుక్మిణి ఫోటోని దేవుడమ్మ చూడటంతో కథ కీలక మలుపు తిరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఊరి గ్రామస్తులు అంతా రుక్మిణి, మాధవ్ గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు ఆదిత్య. దేవిని నాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావో, నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావో ఈరోజూ నాకు అర్థం అయ్యింది. నా మంచి కోసమే కదా ఇంత దగ్గరగా ఉన్న దూరంగా ఉంటున్నావ్ ఆ విషయం తెలియక నేను నిన్ను చాలా మాటలు అని బాధపెట్టాను ఐయామ్ సోరి రుక్మిణి అని అనుకుంటాడు. దేవికి రుక్మిణి ప్రేమగా తినిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళావ్ అని రుక్మిణి దేవిని అడుగుతుంది.

దేవి: మా నాయన ఎవరో తెలుసుకుందామని ఫోటో పట్టుకుని వెతుక్కుంటూ పోయినా, అలా ఎక్కడెక్కడో తిరిగిన తర్వాత శోచ వచ్చి పడిపోయాను. తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నా ఏం జరిగిందో తెలియదు

మాధవ్: నేను ఏర్పాటు చేసిన వాళ్ళకి దేవి దొరకలేదు. దొరికి ఉంటే కథ వేరేలా ఉండేది

దేవి: ఇప్పుడైనా మా నాయన ఎవరో చెప్పమ్మా.. నువ్వు చెప్పవు నాకు తెలుసు అనేసి కోపంగా వెళ్ళిపోతుంది.

ఆదిత్య ఇంటికి వస్తాడు. రెండు రోజులు కష్టపడ్డాం దేవి క్షేమంగా ఇంటికి వచ్చిందని చెప్తాడు. ఎలా ఉంది బాగుందా? ఎవరు తీసుకెళ్లారు అని దేవుడమ్మ అడుగుతుంది. ఆదిత్య జరిగింది మొత్తం చెప్తాడు. బిడ్డ క్షేమంగా దొరికింది అది చాలు అని దేవుడమ్మ అంటుంది. ఆఫీసు నుంచి ఒకటే ఫోన్స్ వస్తున్నాయ్ త్వరగా రెడీ అయి వెళ్ళమని దేవుడమ్మ చెప్తుంది. రాధ కూర్చుని ఆలోచిస్తుంటే మాధవ్ వస్తాడు. ముందు బయటకి పో అని అరుస్తుంది.

Also Read: యష్ ని నిలదీసిన మాలిని, వెనకేసుకొచ్చిన వేద- అభిమన్యుకి ఎదురుతిరిగిన మాళవిక

మాధవ్: నువ్వు అలా మాట్లాడకు రాధ గుండెల్లో గుచ్చినట్టు ఉంది

రాధ: ఊరి జనం ముందు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావ్. నా పెనిమిటిని దేవి నా బిడ్డ అని చెప్పడానికి లేకుండా చేశావ్

మాధవ్: నేను ఏం చేశాను రాధ.. నా మనసులోనే కాదు ఊరి జనం మనసులో కూడా నువ్వు ఏంటి అనేది ఆ అదిత్యకి అర్థం అయ్యేలా చేశాను

రాధ: నువ్వు ఏంటి అనేది నాకు ఎప్పుడో అర్థం అయ్యింది. ఈరోజు కాకపోతే రేపైనా దేవి వాళ్ళ నాయన దగ్గరకి వెళ్తుంది అది నువ్వు ఆపలేవు. నన్ను నా బిడ్డని బాధపెట్టినందుకు అనుభవిస్తావ్. దేవమ్మని కనిపించకుండా చేసి ఆ గుడిలో కూడా మస్త్ కథలు పడ్డావ్ అది నాకు తెలియదు అనుకుంటున్నావా పో ఇక్కడి నుంచి అని అరుస్తుంది.

ఆదిత్య గురించి దేవుడమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో నా దగ్గర దాస్తున్నాడు అడిగినప్పుడల్లా ఏం లేదమ్మా సమయం వచ్చినప్పుడు చెప్తాను అని మాట దాటేస్తున్నాడు. వాడు దాస్తునది మరో ఆడదాని విషయమా సత్యని పెళ్లి చేసుకున్న తర్వాత రాని మార్పు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏంటి ఈ ఖర్మ చివరకి నా బిడ్డని నేనే అనుమానించాల్సిన అవసరం వచ్చింది. అసలు ఏం జరుగుతుంది. ఆదిత్య దేని గురించి బాధపడుతున్నాడో ఈ రెండు రోజుల్లో తేల్చేస్తాను. నా బిడ్డ తప్పు చేయడం లేదని తెలుసుకోవడానికి ఈ పని చేయక తప్పదని దేవుడమ్మ అనుకుంటుంది.

Also Read: ఎట్టకేలకి దేవి చెంతకి ఆదిత్య, రుక్మిణి- అక్కడ మాధవ్ ఇచ్చిన షాక్ కి బిత్తరపోయిన రాధ

ఆదిత్య దేవి కోసం స్కూల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నిన్ను చూడకుండా ఉండలేను కదా అని ఆదిత్య అంటాడు. అలా కనిపించకుండా వెళ్ళేసరికి ఎంత కంగారు పడ్డామో తెలుసా అని అడుగుతాడు. మా నాయన ఎక్కడ అని అడిగితే ఏమి చెప్పడం లేదు అందుకే నాయన్ని వెతుక్కుంటూ వెళ్ళాను అని చెప్తుంది. అలా వెళ్లిపోతే నేను ఏమైపోవాలి చెప్పు అని ఎమోషనల్ గా అడుగుతాడు. నాన్న అంటే అంత ఇష్టమా నీకు అని అడుగుతాడు. ఇష్టం ఎలా ఉంటది,, మస్త్ కోపంగా ఉంది, కనిపిస్తే ఏదేదో చేయాలని ఉంది అని చెప్తుంది. ఇప్పుడు మీ నాన్న కనిపిస్తే.. ఇప్పటికిప్పుడు ఎదురొచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్తే ఏం చేస్తావ్ అని అడుగుతాడు. వస్తే మంచిగానే ఉంటది సారు.. మా నాయన మా దగ్గరకి వస్తే మా అమ్మని తనని ఒకటి చేస్తా. మా నాయన ఇడిచిపెట్టి వెళ్లాడని కోపం ఉంటుంది కానీ కళ్ళ ముందు కనిపిస్తే ఆ కోపం ఉంటదా సారు అని దేవి ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Embed widget