Devatha July 28th Update: ఆదిత్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న రుక్మిణిని దేవి చూస్తుందా? తండ్రిపై ద్వేషంతో రగిలిపోతున్న దేవి
రుక్మిణి గుడిలో వరలక్ష్మి వ్రతం పూజని చేసుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
రుక్మిణి గుడిలో వరలక్ష్మి వ్రతం పూజని చేసుకుంటుంది. దేవి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తూ ఆఫీసర్ సార్ దగ్గరకి పోయి మళ్ళీ చెప్పాలి అమ్మని బాధపెట్టిన నాయన్ని విడిచిపెట్టకూడదు. నాకు ఏ కష్టం వచ్చిన ఆఫీసర్ సార్ కి చెప్పుకోవాలని అనుకున్నా.. ఆయన దగ్గరకి పోతానంటే అమ్మ వద్దంటది.. అమ్మకి కోపం వచ్చినా తిట్టినా పర్వాలేదు నేను సార్ ని కలవాలి నాయన గురించి చెప్పాలి అని అనుకుంటుంది. ఇటు ఆదిత్య ఇంట్లోనూ వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉండగా దేవి వస్తుంది. అందరి ముందు నాయన గురించి ఎలా చెప్పాలి అని వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే భాషా చూసి దేవమ్మా అని పిలుస్తాడు. దేవిని చూసి అందరూ సంతోషిస్తారు. పూజలో కూర్చుందుగాని రా అని దేవుడమ్మ పిలుస్తుంది. ఆఫీసర్ సార్ తో మాట్లాడదామని వచ్చిన మీరు పూజ చేసుకోండి నేను వెళ్తాను అని దేవి అంటుంది. ఆదిత్య వద్దు ఉండమన్న ఉండకుండా దేవి వెళ్ళిపోతుంది. తన వెనకే ఆదిత్య కూడ వెళ్తాడు. పూజ మధ్యలో నుంచి వెళ్లకూడదు అని దేవుడమ్మ వాళ్ళు చెప్పినా వినకుండా ఆదిత్య దేవి వెనకే వెళ్ళిపోవడంతో సత్య బాధపడుతుంది.
Also Read: పగిలిన మాళవిక బోనం, వేద కాలికి గుచ్చుకున్న గాజుపెంకు - అమ్మవారు ఎవరిని ఆశీర్వదించారు?
గుడిలో వరలక్ష్మి వ్రతం పూర్తి కావస్తుంది భర్త ఆశీర్వాదం తీసుకోవాలని పూజారి రాధకి చెప్తాడు. పూజ అయినక భర్త కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి గా మాధవ సారు లేకుండా ఉండటమే మంచిది అయింది. లేదంటే ఆ సారు కాళ్ళు మొక్కించే వాళ్ళు అని రుక్మిణి మనసులో అనుకుంటుంది. అమ్మవారి దగ్గర నుంచి కొన్ని అక్షింతలు తీసుకుని రుక్మిణి వస్తుంది. నాకు బాధ వుంటే ఉంటే మాయమ్మకి చెప్తాను మాయమ్మకే బాధ వస్తే నేను ఎవరికి చెప్పాలి. అందుకే నీ దగ్గరకి వచ్చాను అంటుంది. మా బాధ మా నాయనే సారు. మా నాయన్ని విడిచిపెట్టకూడదు. మాయమ్మని మస్త్ బాధలు పెట్టాడు. కొట్టినడు, తిట్టినడు అలాంటి వాడిని ఎలా విడిచిపెడతారు. నువ్వే నాకు సాయం చెయ్యాలి. ఎట్లయిన మ నాయన్ని నువ్వే పట్టుకోవాలి అని దేవి అడుగుతుంది. మీ నాయన ఎట్లా ఉంటాడో నీకు తెలుసా తల్లి అని ఆదిత్య ఆవేదనగా అడుగుతాడు. తెలిసుంటే సీదా ఇంటికి పోయి ఇంటి ముందు ఇజ్జత్ తీసేదాన్ని మాయమ్మని ఫోటో అయిన ఇవ్వమంటే లేదన్నది. నువ్వు పెద్ద ఆఫీసర్ వి కదా నీ మాట అందరూ వింటారు కదా పట్టుకోమని చెప్పు అని అంటుంది. ఒకవేళ మీ అమ్మ కనిపిస్తే ఏం చేస్తావని అడుగుతాడు. ముందైతే చచ్చి ఒక్కటి ఇస్తాను.. పక్కనే నువ్వు ఉంటావ్ కదా భయమేముంటాడి మాయమ్మని కొట్టినట్టు కొడతా.. మాయమ్మ కాళ్ళు మొక్కిస్తా. గట్లనే మమ్మల్ని మంచిగా చూసుకున్న మా నాయనకి థాంక్స్ చెప్తా అని అంటుంది. నువ్వు ఏం చూడకుండా మీ నన్న మీద అంతా కోపం పెంచుకుంటే ఎలాగమ్మా అంటాడు. ఏం చూడకుండా ఏంది సారు అర్థం అవుతుంది కదా మాయమ్మ మేము పడుకున్నాక ఏడుస్తూ కూర్చుంటుంది. కానీ ఎప్పుడు మానాయన గురించి చెడుగా ఒక్కమాట కూడా చెప్పలేదు అని దేవి అంటుంది. చెప్తే ఏమవుతుందో అని చెప్పకుండా చేశావ్ కదా రుక్మిణి ఇప్పుడు నా బిడ్డ దృష్టిలో నేనే విలన్ అయ్యాను కదా అని ఆదిత్య మనసులోనే బాధపడతాడు.
Also Read: నీకిచ్చిన మాట కోసమే జానకిని చదివిస్తున్నా అని జ్ఞానంబతో చెప్పిన రామా
రుక్మిణి అప్పుడే అదిత్యకి ఫోన్ చేస్తుంది. గుడి దగ్గర ఉన్న నీతో మాట్లాడాలి అని అడుగుతుంది వస్తున్నా అని చెప్పి దేవిని తీసుకుని గుడికి వెళ్తాడు. రామూర్తి దంపతులు ఇంటికి వెళ్దామని రాధని అడిగితే మీరు వెళ్ళండి నేను కాసేపాగి వస్తాను అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది. గుడికి ఆదిత్య రావడం చూసి సంతోషిస్తుంటే పక్కన దేవి కూడా ఉండటం చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి ఇంట్లో ఉంటానని చెప్పి ఆఫీసర్ సార్ ఎలా కలిశారని అడుగుతుంది. ఒక్కదానివి ఎందుకు వెళ్లావ్ అని అడుగుతుంది. కొన్ని ప్రశ్నలకి సమాధానం నాదగ్గర దొరుకుతుందని వచ్చిందని చెప్తాడు. దేవి గుడిలోకి వెళ్ళగానే రుక్మిణి ఆదిత్య చేతిలో అక్షింతలు పెట్టి కాళ్ళ మీద పడుతుంది. నీ కాళ్ళ మీద పడింది ఆశీర్వాదం కోసమే కాదు క్షమించమని ఆడగటానికి కూడా నిన్ను ఇడిచిపెట్టి ఇంట్లో నుంచి వచ్చినా నువ్వు కట్టిన తాళి నా మెడలో ఇంకా ఉంది. నీతో లేకుండా దీర్ఘ సుమంగలిగా ఉండాలని ఆశీర్వదించు పెనిమిటి అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆదిత్య రుక్మిణి తలమీద అక్షింతలు వేస్తున్న టైం కి దేవి గుడిలో నుంచి వస్తూ ఉంటుంది.