Janaki Kalaganaledu July 27th Update: నీకిచ్చిన మాట కోసమే జానకిని చదివిస్తున్నా అని జ్ఞానంబతో చెప్పిన రామా
జానకి ఐపీఎస్ చదువుతున్న విషయం జ్ఞానంబకి తెలిసపోవడంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ఐపీఎస్ ట్రైనింగ్ లో జానకి ఫస్ట్ వచ్చినట్టు ప్రకటిస్తారు. ఇక షీల్డ్ అందుకున్న తర్వాత జానకిని మాట్లాడమని మైక్ ఇస్తారు. ఈరోజు ఇది నేను గెలిచానంటే అందుకు ఇద్దరు వ్యక్తులు కారణం ఒకరు నా తండ్రి, రెండు నా భర్త అని జానకి ఎమోషనల్ అవుతుంది. అదంతా జ్ఞానంబ చూస్తూ ఉంటుంది. 'చిన్నప్పటి నుంచి ఐపీఎస్ కావాలని నా మనసులో ఏర్పడటానికి కారణం మా నాన్న.. ఆ ఆలోచన ఆ తర్వాత నాకు కలగా మారింది. ఆ కాలే నాకు ఊపిరి అయ్యింది. కానీ మా నాన్న మరణం నా కలని కన్నీళ్లగా మార్చింది. నా ఐపీఎస్ కలని శూన్యం చేసింది. ఆ క్షణంలో నన్ను ఒక చెయ్యి నన్ను శూన్యంలో నుంచి బయటకి తీసుకొచ్చింది నీ కలని నేను నిజం చేస్తానంటూ నన్ను వెన్నుతట్టి నా వెనక ఉంది నడిపించిది. ఆ చెయ్యి ఎవరో కాదు నా భర్త రామచంద్ర. నేను ఇక్కడి వరకు వచ్చి చదువుకోవడానికి ఎన్నో సమస్యలు ఎదురు అవుతున్నాయి. కానీ వాటన్నిటినీ కూడా అధిగమించి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు రేపు నేను ఐపీఎస్ అయితే అది నా గెలుపు కాదు నా భర్త గెలుపు. మా ఆయన లేకుండా నేను లేను. ఆయన సహకారం లేకపోతే నేను ఇది గెలిచెదాన్ని కాదు. ఆయన సపోర్ట్ తో నేను కచ్చితంగా ఐపీఎస్ గెలుస్తాను. నా విజయాన్ని మా ఆయనకి బహుమతిగా ఇస్తాను' అని జానకి ఎమోషనల్ అవుతుంది. ఆ మాటకి అర్థం ఎంటో తెలుసా అత్తయ్యగారు మ అమ్మకి తెలియకుండా నిన్ను చదివిస్తాను, అవసరమైతే ఎదిరిస్తాను అని బావగారు జానకికి మాట ఇచ్చారని మల్లిక ఎక్కిస్తుంది. అప్పుడే జానకి, రామా జ్ఞానంబ వాళ్ళని చూసి షాక్ అవుతారు.
Also Read: నువ్వు తల్లివెంటీ అని మాళవికని అవమానించిన అభిమన్యు- యష్ ని ఆట పట్టించిన ఖుషి, వేద
అక్కడ నుంచి కోపంగా జ్ఞానంబ వెళ్లిపోతుంది. జానకి ఇటు నుంచే వెళ్లిపోతుందని అనుకుంటే సీన్ రివర్స్ అయ్యిందేంటి పోలేరమ్మ చెప్పాపెట్టకుండా వెళ్ళింది ఏంటి మల్లిక అనుకుంటుంది. ఇక జ్ఞానంబ కనిపించకపోయేసరికి అందరూ భయపడుతూ వెతుకుతూ ఉంటారు. ఇంటికి వెళ్ళి అక్కడికి అమ్మ వచ్చిందేమో చూసి ఫోన్ చేసి చెప్పమని రామా తన తండ్రికి చెప్తాడు. జ్ఞానంబ జానకి ఇచ్చిన మాటలు గుర్తు చేసుకుంటూ నడుచుకుంటూ దిగులుగా వెళ్ళిపోతుంది. గోవిందరాజులు ఇంటికి వచ్చి అమ్మ వచ్చిందా అని అడుగుతాడు. అసలు ఏం జరిగిందని విష్ణు మల్లికను అడుగుతాడు. జానకి మోసం చేసిందని తెలిసి వెన్నుపోతుని తట్టుకోలేక పాపం ఆ బాధతో అత్తయ్యగారు ఎటు వెళ్లిపోయారో ఎంటో అని నటిస్తుంది. జానకి వదిన మోసం చెయ్యడం ఏంటి అని అఖిల్ అడుగుతాడు. బావగారు ఇంట్లో ఎవరికి తెలియకుండా జానకికి ఐపీఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ప్రతి రోజు వాళ్ళు దొంగతనంగా బయటకి వెళ్తుంది అందుకే. కేకులు తయారు చేయడానికి అని అప్పట్లో జానకి రాజమండ్రి వెళ్ళింది కదా అది కేకు తయారు చెయ్యడం నేర్చుకోడానికి కాదు చదువుకోడానికి. ఎంత మోసం ఎంత కుట్ర కాలు తిరిగిన రైటర్ కళ్ళు మూసుకుని రాసినట్టు ఎన్ని కథలు అల్లారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు అని నోటికి వచ్చినట్టు వాగుతుంది.
Also Read: సామ్రాట్ ఒడిలో తులసి, రగిలిపోతున్న నందు- అభిని నమ్మనన్న అంకిత
ఇదంతా నీ వల్లే అని గోవిందరాజులు మల్లికను తిడతాడు. మీ అత్తయ్యని అక్కడికి తీసుకురావడం వల్లెగా ఇది జరిగిందని చీవాట్లు పెడతాడు. జ్ఞానంబ పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్తుంటే కారు గుద్దబోతుంది. అతను వచ్చి జ్ఞానంబని తిడతాడు. ఒకచోట నిలబడి జ్ఞానంబ జానకి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే మరోవైపు జానకి, రామాలు తనకోసం వెతుక్కుంటూ ఆమె ఉన్న దగ్గరకి వస్తారు. ఈ జ్ఞానంబ చనిపోయేంత పిరికిది కాదు, నన్ను నా నమ్మకాన్ని మోసం చేశారని తెలిసిన క్షణమే చచ్చిపోయాను. దాని ముందు నా ప్రాణం పోవడం చాలా చిన్న విషయం, నువ్వు చేసిన నమ్మకద్రోహానికి ఈ గుండె ఎంత గాయపడి ఉంటుందని బాధపడుతుంది. నేను చేసింది తప్పెనమ్మా అని రామా అంటాడు. తప్పు కాదు మోసం, ఈ అమ్మ నమ్మకంతో ఈ అమ్మ ప్రేమ తో ఆడుకున్నావ్ చివరికి ఈ అమ్మని పిచ్చిదాన్ని చేశావని అంటుంది. లేదమ్మా ఈ లోకంలో మా అమ్మ కంటే మా అమ్మ ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు ఏది విలువైనది కాదు.. అలాంటి మా అమ్మ ప్రేమతో నేను ఆడుకోనమ్మా అని అంటాడు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి ఈ అమ్మ ప్రేమతో ఆడుకోవడం కాక ఏం చేశావ్ ఈ అమ్మ భయం నీ జీవితం గురించి, నా తమ్ముడి లాంటి పరిస్థితి ఎక్కడ నా కొడుక్కి వస్తుందో అన్న భయంతో నీకంటే తక్కువ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చెయ్యాలని అనుకున్నాను. కానీ తన అన్నయ్య అతను చదువుకుందని దాచిపెట్టి పెళ్లి చేశాడు. కానీ జానకి మీద నమ్మకంతో ఒక మెట్టు దిగాను. నాకు అబద్ధాలు చెప్పి ప్రతి రోజు తనని చదువుకునే చోటుకి తీసుకెళ్లావ్.. అంటే నీ మీద నాకున్న భయం పిచ్చితనంలాగా అనిపించింది. నువ్వు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావా అని నిలదిస్తుంది. నీకిచ్చిన మాట కోసమే జానకిగారిని చదివిస్తున్నాను అని రామా అంటాడు.