News
News
X

Deepika Padukone: ‘ప్రాజెక్ట్ కె’ కోసం దీపికా పదుకోణ్ కు షాకింగ్ రెమ్యూనరేషన్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణ్ కు షాకింగ్ రెమ్యూనరేషన్ ఇచ్చారట మేకర్స్.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ లో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బడా ప్రాజెక్టులలో హీరో ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా ఒకటి. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణ్ నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, దిశా పఠానీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల  అయిన ప్రచార చిత్రాలు ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. 

అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు దీపికా దాదాపు 10 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. కానీ నెట్టింట మాత్రం అందరూ దీపికా పారితోషికం గురించే మాట్లాడుకుంటున్నారట. ఈ చిత్రం నుంచి దీపికా పదుకోణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సంవత్సరం ప్రారంభంలో నటి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. పోస్టర్‌లో దీపిక ముఖం కనిపించలేదు. ఆమె సూర్యుడికి వ్యతిరేకంగా నిలబడి, యోధురాలిగా కనిపించే దుస్తులు ధరించి కనిపించింది. పోస్టర్‌పై “చీకటిలో ఒక ఆశ” అని రాసి ఉంది. దీంతో దీపికా పాత్ర పై ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ దాదాపు 500 కోట్లకు పైగా నే ఖర్చే చేసి తీస్తున్నారట. గతంలో వైజయంతి మూవీస్ లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి క్లాసిక్స్‌  సినిమాలనుఈ నిర్మాణ సంస్థ అందించింది. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మరో చిత్రమే ‘ప్రాజెక్ట్ కె’. ఇటీవల ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ను ఆధునిక విష్ణువు అవతారంగా అభివర్ణించారాయన. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రంగా ఈ మూవీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా అంతే స్థాయిలో ఉంటాయని, తాము ఈ మూవీ కోసం గత ఐదు నెలలుగా శ్రమిస్తున్నామని, ఇంకా ఏడాది పాటు ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతాయని అన్నారు. 

ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని తెలిపారాయన. మూవీ లో స్టంట్స్ కూడా ఊహకు అందనట్టుగా ఉంటాయని, అందుకోసం నలుగురైదుగురు ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ పనిచేస్తున్నారని అన్నారు. స్క్రీన్ మీద పాత్రలను చూసినపుడు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారని అన్నారు. మూవీ లో చాలా మంది సెలబ్రెటీ నటీనటులు ఉన్నారని, వారందరి పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. అలాగే ఈ సినిమా కోసం సంతోష్ నారాయణ్ సహా, బాలీవుడ్ కు చెందిన లేడీ మ్యూజిషియన్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలిపారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. 

Published at : 07 Mar 2023 09:28 PM (IST) Tags: Nag Ashwin Project K Prabhas Deepika Padukone

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌