HBD Deepika Padukone: హాలీవుడ్ రేంజ్‌లో దీపికా ‘ప్రాజెక్ట్ కే’ లుక్ - ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
ప్రాజెక్ట్ కే, పఠాన్ సినిమా టీమ్‌లు దీపికా పడుకోనే పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది.
బాలీవుడ్ భామ దీపికా పడుకోనే పుట్టినరోజు సందర్భంగా తన ప్రీ-లుక్‌ను ‘ప్రాజెక్ట్ కే’ టీమ్ విడుదల చేసింది. ‘డూన్’, ‘ఆబ్లివియన్’ లాంటి హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌కు మాత్రమే కాదు ఏకంగా హాలీవుడ్‌నే తలదన్నే సినిమాను నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నాయి.
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే. మేయర్ సంగీతం అందిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సూర్య అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాటు ఇంగ్లిష్‌లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
'ప్రాజెక్ట్ కె' కంటే ముందు 'ఆదిపురుష్' సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న 'సలార్', మారుతి దర్శకత్వంలో చేయబోయే హారర్ కామెడీ సినిమాలు కూడా లైనులో ఉన్నాయి.
ఇక దీపికా పడుకోనే నటించిన ‘పఠాన్’ సినిమా నుంచి కూడా కొత్త లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కూడా దీపిక అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తుండటం విశేషం. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
View this post on Instagram
View this post on Instagram