By: ABP Desam | Updated at : 05 Mar 2023 01:10 PM (IST)
Edited By: anjibabuchittimalla
'అహింస' సినిమాలో ప్రధాన తారాగణం (Photo @ Suresh Productions / Instagram)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అహింస’. గీతిక తివారీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సదా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో రానా సోదరుడు అభిరామ్ వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్ర బృదం అధికారికంగా వెల్లడించింది.
‘అహింస’కు ఎన్నో ఇబ్బందులు
తేజ దర్శకత్వం వహిస్తున్న ‘అహింస’ మూవీ కరోనా సమయంలో మొదలయ్యింది. మహమ్మారి కారణంగా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నది. ప్రేమ కథలను సరికొత్తగా ఆవిష్కరించడంలో తేజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఈ సినిమాను కొత్త తరహా ప్రేమ కథగా అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ‘అహింస’
దగ్గుబాటి అభిరాం ఈ సినిమా ద్వారా హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఒక కొత్త నటుడుని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో తేజకు మంచి అనుభవం ఉండటంతో సురేష్ బాబు ఆయనను ఎంచుకున్నారు. ఈ సినిమా కథ అభిరామ్ కు కచ్చితంగా సూటయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమా రఫ్ కట్ చూసి సురేష్ బాబు హ్యాపీగా ఫీలైనట్లు తెలుస్తోంది. అహింస మార్గంలో ఉండాలనుకునే ఓ యువకుడు హింస వైపు ఎందుకు మళ్లాడు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కినట్లు సురేష్ బాబు ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాలో తన అబ్బాయి బాగా నటించినట్లు చెప్పారు.
ఆకట్టుకున్న ‘అహింస’ టీజర్
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ‘అహింస’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లేక్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పదన లభించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'నీతోనే నీతోనే', 'కమ్మగుంటదే' పాటలు ట్రెడింగ్ లో నిలిచాయి. తేజ, పట్నాయక్ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలోని పాటలు సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్ ఇప్పటికే విడుదల చేఇన కొత్త పోస్టర్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అభిరామ్ యాక్షన్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ కు చేరుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 7న థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
Read Also: ‘బాహుబలి 2’ రికార్డు బద్దలుకొట్టిన ‘పఠాన్’, శోభు యార్లగడ్డ ఏమన్నారంటే?
Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన
Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్
Upasana On Ram Charan : నా మార్గదర్శి రామ్ చరణ్ - భర్త గురించి ఉపాసన ఎంత బాగా చెప్పిందో
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు