News
News
X

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ ను 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదితో రాయించారట.  

FOLLOW US: 

మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ధమాకా'(Dhamaka). 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఆ ట్యాగ్ లైన్ వెనుక కారణం అదే. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో కామెడీ స్కిట్స్ ను 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదితో రాయించారట. దర్శకుడు త్రినాథరావు, హైపర్ ఆది మంచి స్నేహితులు. ఇదివరకు త్రినాథరావు తన సినిమాలో రైటర్ ప్రసన్న కుమార్ ను బాగా ఇన్వాల్వ్ చేసేవారు. ఇప్పుడు హైపర్ ఆది సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. సినిమాలో కామెడీకి ఎక్కువ చోటుంది. ఆ కామెడీ ఎపిసోడ్స్ ను హైపర్ ఆదితో రాయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అక్కడక్కడా జబర్దస్త్ స్టయిల్ లో స్కిట్స్ కనపడతాయని చెబుతున్నారు. బుల్లితెరపై కమెడియన్స్ అలాంటి స్కిట్స్ చేస్తే ఓకే కానీ.. రవితేజ లాంటి మాస్ హీరోతో అటువంటి కామెడీ స్కిట్స్ ను ఎంతవరకు పండించగలరో చూడాలి.  

ఈ సినిమాలో 'పెళ్లి సందడి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల.. రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. 

సినిమా స్టోరీ:
అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ రెండు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నారు. హీరో క్యారెక్టర్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడి ఉంటుందని.. ఈ క్యారెక్టర్ చుట్టూనే సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఓ కంపెనీకి సీఈవోగా కనిపించే రవితేజ.. మరోవైపు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కూడా కనిపిస్తాడట. అయితే కంపెనీ సీఈవో అనుకొని పొరపాటున మిడిల్ క్లాస్ వ్యక్తిని రౌడీలు కిడ్నాప్ చేయడం అనేదే ఈ సినిమాలో అసలు ట్విస్ట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

News Reels

రవితేజ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:
ఈ సినిమాతో పాటు 'రావణాసుర', 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' సినిమాల్లో నటిస్తున్నారు రవితేజ. 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక 'రావణాసుర' సినిమాను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ గా రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. 

Also Read : బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానా నాయుడు' టీజర్ రిలీజ్

Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!

Published at : 24 Sep 2022 07:12 PM (IST) Tags: raviteja Hyper Aadi Dhamaka Movie Trinadharao nakkina dhamaka comedy skits

సంబంధిత కథనాలు

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి