Zebra OTT Platform : సత్యదేవ్ 'జీబ్రా' మూవీ డిజిటల్ డీల్ సెట్టు.... ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందంటే ?
Zebra OTT : సత్యదేవ్ 'జీబ్రా' మూవీ డిజిటల్ డీల్ భారీ ధరకు సెట్టయ్యింది. మరి ఈ మూవీ ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందంటే ?
Zebra OTT Stream : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన సత్యదేవ్ ఈ శుక్రవారం "జీబ్రా" అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. దీంతో ప్రేక్షకులు ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే "జీబ్రా" మూవీ రైట్స్ ను ఏ ఓటిటి దక్కించుకుంది అనే విషయం వెళ్లడైంది.
సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనుంజయ కలిసి నటిస్తున్న మోస్ట్ యాంటీసిపెటెడ్ మల్టీస్టారర్ మూవీ "జీబ్రా". ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పద్మజ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ పద్మజ, ఎస్ఎన్ రెడ్డి, దినేష్ సుందరం, బాల సుందరం కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవాని శంకర్, జెనీఫర్ పిషినాటో హీరోయిన్ గా నటిస్తున్నారు. "జీబ్రా" మూవీ నవంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలను వేయగా, వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది.
ఈ సినిమా బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ తిరిగే కథ. ఈ క్రైమ్ కథా చిత్రం తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని బలంగా నమ్ముతున్నారు సత్యదేవ్. మరోవైపు ఈ సినిమా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేయడం, ఈవెంట్ లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటన వల్ల సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా చిరంజీవి సత్యదేవ్ తన మూడవ సోదరుడు అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో సత్యదేవ్ కి మెగా అభిమానుల అండ కూడా ఉంది. కానీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే
ఇక అసలు విషయంలోకి వెళ్తే... జీబ్రా మూవీ ఓటిటి రైట్స్ ని అచ్చ తెలుగు ఓటిటి ఆహా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆహా ఈ మూవీ రైట్స్ కోసం 5.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే మొత్తానికి "జీబ్రా" మూవీకి మంచి డీల్ కుదిరింది అని చెప్పాలి. ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ ఓటిటిలోకి వస్తే గనుక క్రిస్మస్ ట్రీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.
ఇక ఈరోజు థియేటర్లలో విశ్వక్ సేన్ "మెకానిక్ రాకీ" సినిమాతో... సత్యదేవ్ నటించిన "జీబ్రా" మూవీ పోటీ పడుతోంది. అలాగే అశోక్ గల్లా నటించిన "దేవకీ నందన వాసుదేవ" కూడా నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలలో ఏ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రానుందో చూడాలి. ఇక ఈ సినిమాలన్నీ ప్రచారం జరుగుతున్నట్టుగా క్రిస్మస్ కానుకగా ఓటీటీలోకి ఒకేసారి వస్తే.. ఓటిటి మూవీ లవర్స్ కు పండగే.
Read Also : Nabha Natesh : నభా నటేష్ బ్లౌజ్ డిజైన్ చూశారా? హాఫ్ శారీలో ఇస్మార్ట్‌గా ఉన్న బ్యూటీ