Ante Sundaraniki First Song: పంచెకట్టుతో రంగంలో దూకిన నాని - 'అంటే సుందరానికి' ఫస్ట్ సాంగ్ ఇదిగో
The PanchaKattu Song Out Now - Ante Sundaraniki Movie Update: నాని హీరోగా రూపొందుతోన్న 'అంటే సుందరానికి' సినిమాలో ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. చూశారా?
పంచెకట్టుతో రంగంలోకి దూకారు నేచురల్ స్టార్ నాని (Nani). అదీ ఇక్కడ కాదు, విదేశాల్లో! సుందర్ స్టైల్ అలాంటిది మరి! సుందర్ పాత్రలో నాని నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి' (Ante Sundaraniki Movie). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తొలి పాట 'ది పంచెకట్టు...' (The PanchaKattu Song) ను ఈ రోజు విడుదల చేశారు.
వివేక్ సాగర్ (Vivek Sagar) సంగీతం అందించగా... హసిత్ గోలి 'ది పంచెకట్టు...' పాటను రాశారు. లెజండరీ సింగర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కర్ణాటిక్ సంగీతంలో నిష్ణాతురాలు అరుణ సాయిరామ్ (Aruna Sairam First Telugu Movie Song) ఈ పాటను ఆలపించారు. తెలుగులో ఆమె పాడిన తొలి పాట ఇదే.
"మా ఫస్ట్ ఆవకాయ్ జాడీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇక నుంచి మా సుందర్ 'పంచెకట్టు సాంగ్ మీదే" అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
Sundar’s #ThePanchaKattuSong is all yours now!
— Mythri Movie Makers (@MythriOfficial) April 6, 2022
We hope you enjoy our 1st Jaadi of Avakai ♥🎧
▶️ https://t.co/otK4Sw98Rr#AnteSundaraniki@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @arunasays @hasithgoli @saregamasouth pic.twitter.com/nTjAuqSSxj
నాని సరసన మలయాళ భామ నజ్రియా నజిమ్ (Nazriya Nazim) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై 'అంటే సుందరానికి' నిర్మిస్తున్నారు. జూన్ 10న ఈ సినిమాను విడుదల (Ante Sundaraniki Movie Release Date) చేయనున్నట్టు వెల్లడించారు.
Also Read: ప్రేమించడానికి రీజన్, ఎందుకు ప్రేమించామా అంటే ఆన్సర్ ఉండకూడదు - '18 పేజెస్' గ్లింప్స్ చూశారా?
Also Read: తమిళ తెరకు అక్కినేని నాగచైతన్య, తెలుగుతో పాటు!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.