అన్వేషించండి
Naga Chaitanya New Movie Update: తమిళ తెరకు అక్కినేని నాగచైతన్య, తెలుగుతో పాటు!
Naga Chaitanya Venkat Prabhu Movie Update: వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

శ్రీనివాసా చిట్టూరి, నాగ చైతన్య, వెంకట్ ప్రభు
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య త్వరలో తమిళ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. తెలుగుతో పాటు తమిళంలో తెరకెక్కనున్న ద్విభాషా సినిమాకు ఆయన సంతకం చేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఆ సినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు.
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. ప్రస్తుతం రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్'ను ఆయనే నిర్మిస్తున్నారు. అది కూడా తెలుగు, తమిళ చిత్రమే. నాగ చైతన్యకు ఇది 22వ చిత్రమిది.
తమిళంలో శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'మానాడు' భారీ విజయం సాధించింది. తెలుగులో నాగ చైతన్య హీరోగా ఆ సినిమాను రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే... తెలుగు, తమిళ్ బైలింగ్వల్ సినిమా అని ప్రకటించడంలో నాగ చైతన్యతో వెంకట్ ప్రభు చేయబోయేది రీమేక్ కాదని స్పష్టం అయ్యింది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకాకాలంలో రూపొందబోయే ఈ చిత్రాన్ని హై టెక్నికల్ స్టాండర్డ్స్, భారీ బడ్జెట్‌తో.... కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. త్వరలో సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఇండియా
ఆటో
లైఫ్స్టైల్





















