18 Pages Telugu Movie Glimpse: ప్రేమించడానికి రీజన్, ఎందుకు ప్రేమించామా అంటే ఆన్సర్ ఉండకూడదు - '18 పేజెస్' గ్లింప్స్ చూశారా?
Nikhil Siddharth and Anupama Parameswaran's 18 Pages Movie Glimpse Out Now: నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న '18 పేజెస్' సినిమా గ్లింప్స్ విడుదలైంది.
నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharth), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా కనిపించనున్న చిత్రం '18 పేజెస్'. సుకుమార్ (Sukumar) అందించిన కథతో రూపొందుతోన్న చిత్రమిది. దీనికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సినిమా గ్లింప్స్ (18 Pages Movie Glimpse) విడుదల చేశారు.
గ్లింప్స్ చూస్తే... 'నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది... ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు! ఎందుకు ప్రేమించామా అంటే ఆన్సర్ ఉండకూడదు అని' అంటూ నిఖిల్ చెప్పే డైలాగుతో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత 'నన్నయ్య రాసిన కావ్యం ఆగితే... తిక్కన తీర్చేనుగా! రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా' అంటూ చక్కటి నేపథ్య గీతం వచ్చింది.
'18 పేజెస్' సినిమాలో కథలు రాసే యువతి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ కనిపించనున్నారు. ఆమెకు ప్రియుడిగా ఎప్పుడూ ఫోనులో ఉండే హుషారైన పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు.
Also Read: ఇంతకీ ఇల్లు ఎవరిది? శ్రీదేవిదా - శోభన్ బాబుదా!?
'18 పేజెస్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై 'బన్నీ' వాసు నిర్మిస్తున్నారు. గతంలో 'కుమారి 21 ఎఫ్' సినిమాకు సుకుమార్ కథ అందించగా... పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత వాళ్లిద్దరూ చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.