అన్వేషించండి

Raashii Khanna: దయచేసి ఆపేయండి, నేను అలా అనలేదు - రాశీ ఖన్నా

Raashi Khanna Comments On South Films: రాశీ ఖన్నా అటువంటి సౌత్ ఇండస్ట్రీ మీద ఆమె కామెంట్స్ చేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని ఆమె ఖండించారు. 

Raashi Khanna: రాశీ ఖన్నా ఉత్తరాది అమ్మాయి. అయితే... ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ రావడానికి కారణం సౌత్ సినిమాలు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు సినిమాలు. కథానాయికగా తొలి సినిమా 'మద్రాస్ కేఫ్' తర్వాత మళ్ళీ ఇప్పుడు హిందీ సినిమా 'యోధ' చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన వెబ్ సిరీస్ 'రుద్ర' విడుదలైంది. మరో వెబ్ సిరీస్ చేస్తున్నారు. 'రుద్ర' విడుదలైన సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రాశీ ఖన్నా... సౌత్ సినిమాల మీద కామెంట్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించారు.

"సౌత్ సినిమాల గురించి నేను చెడుగా మాట్లాడినట్టు కల్పించి రాసిన కంటెంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది ఎవరు చేసినా... దయచేసి ఆపేయమని కోరుతున్నాను. నేను చేసే ప్రతి సినిమా, భాషపై నాకు గౌరవం ఉంటుంది" అని రాశీ ఖన్నా ట్వీట్ చేశారు.

దక్షిణాది ప్రేక్షకులకు కథానాయిక అందంగా ఉంటే చాలని, ప్రతిభ అవసరం లేదని, తెల్లగా ఉన్న హీరోయిన్లపై మిల్కీ బ్యూటీ అని ముద్ర వేస్తారని రాశీ ఖన్నా అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె వివరణతో అది అబద్ధమని తేలింది.

Also Read: KGF Chapter 2 Telugu: 'కె.జి.యఫ్ 2'లో అమ్మ పాట విన్నారా? ఎదగరా ఎదగరా, జగతికే జ్యోతిగా నిలవరా!

ఇప్పుడు రాశీ ఖన్నా చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యకు జంటగా 'థాంక్యూ' సినిమాలో కనిపించనున్నారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 

Also Read: RRR Movie Success Party Photos: రాజమౌళికి త్రివిక్రమ్ షేక్ హ్యాండ్, ఎన్టీఆర్ - చరణ్ క్లాప్స్

 
 
 
 
 
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
 
 
 
 
 
 
 
 
 
 

Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Raashii Khanna (@raashiikhanna)

టాప్ హెడ్ లైన్స్

Avengers Doomsday Promo : అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్
అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్
Govinda Sunita Ahuja : కూతురి వయసున్న అమ్మాయితో ఇలానా! - గోవిందాపై భార్య సునీత ఫైర్
కూతురి వయసున్న అమ్మాయితో ఇలానా! - గోవిందాపై భార్య సునీత ఫైర్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget