Laila Movie First Look: అమ్మాయిగా మాస్ కా దాస్, ‘లైలా’ ఫస్ట్ లుక్ ఎంత బాగుందో!
విశ్వక్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లైలా’. ఈ మూవీలో ఆయన అమ్మాయిలా కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించి చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకలను బాగా ఆకట్టుకుంటుంది.
Vishwak Sens New Film Laila Launched: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో రాజకీయ నాయకుడిగా విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించడంతో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రతి సినిమాలో తన మార్క్ నటనతో ప్రేక్షకులను అలరించే విశ్వక్.. తన నెక్ట్స్ మూవీ కోసం ఏకంగా అమ్మాయిగా కనిపించడం విశేషం.
అట్టహాసంగా ‘లైలా’ సినిమా పూజా వేడుక
గతంలోనే ‘లైలా’ అనే సినిమా చేయబోతున్నట్లు విశ్వక్ సేన్ ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో నిర్మాణం కానున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు పాల్గొని ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఆకట్టుకుంటున్న ‘లైలా’ ఫస్ట్ లుక్
‘లైలా’ మూవీ ఫస్ట్ లుక్ లో విశ్వక్ అమ్మాయిలా ఆకట్టుకుంటున్నాడు. అయితే, ముఖం, కళ్లు మాత్రమే కనిపించేలా మేకర్స్ ఈ పోస్టర్ ను రూపొందించారు. ప్రస్తుతం ‘లైలా’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అమ్మాయిగా విశ్వక్ ఎంత బాగున్నాడో.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్టర్ తో సినిమాపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ బాగా పెరిగింది. అంతేకాదు, విశ్వక్ ను అమ్మాయిగా ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను సైతం మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
వరుస హిట్లతో జోష్ లో ఉన్న విశ్వక్ సేన్
ఇటీవల విశ్వక్ నటిస్తున్న సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నారు. ఆయన రీసెంట్ మూవీస్ ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మంచి హిట్లుగా నిలిచాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రాజకీయ నాయకుడిగా ఆయన కనబర్చిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పలువురు విమర్శకులు సైతం ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. రెండు వరుస హిట్లతో జోష్ లో ఉన్న ఆయన మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘మెకానిక్ రాకీ’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Read Also: ‘మీర్జాపూర్’ సీజన్ 3 ట్రైలర్: గుడ్డూను టార్గెట్ చేసిన ఖాలీన్ భయ్యా - ఇక సింహాసనం కోసం పోరు!