Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Visa Fee Reductions : వీసా ఫీజుల తగ్గింపు గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగిస్తున్నట్టు భారతదేశంలోని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది.
Visa Fee Reductions : తగ్గించిన వీసా రుసుములను డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించినట్టు భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయం చైనా సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. అదే సమయంలో, భారతదేశం - చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో పురోగతిని సూచిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రెండు దేశాలు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి దౌత్య - సైనిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
విదేశీ ప్రయాణికులను ఆకర్షించేందుకు చైనా తెగ ప్రయత్నిస్తోంది. తమ దేశ సందర్శనను సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన జారీ చేసింది. వీసా ఫీజు తగ్గింపులను డిసెంబర్ 31, 2025 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. 2024లోనే ఈ ధరలను తగ్గించగా.. ఇప్పుడు సింగిల్ ఎంట్రీకి రూ.2,900 ఉండగా, డబుల్ ఎంట్రీకి రూ.4,400 వసూలు చేస్తోంది. 6 నెలల కోసం తీసుకునే మల్టీపుల్ ఎంట్రీ వీసాకు రూ.5.900, ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే వారి కోసం మల్టీ ఎంట్రీ వీసా ఫీజును రూ.8,800గా నిర్ణయించింది. ఇక గ్రూప్ వీసా, అధికారిక గ్రూప్ వీసా కోసం ప్రతి దరఖాస్తుదారు రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : Cars Puncture: ఒకేసారి రహదారిపై 50 వాహనాలు పంక్చర్ - రాత్రివేళ గంటల పాటు ట్రాఫిక్ జామ్, అసలు కారణం ఏంటంటే?
వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు భారత్ - చైనా ఇటీవల గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి కొనసాగనుంది. అలాగే ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇకనుంచి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పట్లో భారత రక్షణ శాఖ కూడా దీనిపై స్పందించింది. పరస్పర భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. చైనాతో అనేక సార్లు దౌత్యపరమైన చర్చలు జరిగిన తర్వాత ఈ ఒప్పందం జరిగినట్లు తెలిపింది.
న్యూ ఇయర్ సందర్భంగా సంచలనం సృష్టిస్తోన్న చైనా ప్రకటన
కొత్త సంవత్సరం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పిన్ దేశ ప్రజలకు సందేశమిచ్చాడు. ఈ సమయంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ ను చైనాలో కలపడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. తైవాన్ కూడా చైనాలో అంతర్భాగమేనన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలం నుంచి తైవాన్ ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చాలా సార్లు జల, గగన తలాల్లో నియమాలను సైతం ఉల్లంఘించింది.
Also Read : Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!