Krishna Last Film: కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
Prema Charitra - Krishna Vijayam: సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి సినిమా 'ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం'. ప్రపంచవ్యాప్తంగా జనవరి 3 విడుదల కానుంది. ఈ సినిమా దర్శకుడు ఏం చెబుతున్నారో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులకు జనవరి 2 ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఎందుకంటే... దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించే సినిమా ఓపెనింగ్ ఆ రోజే. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ లింక్ (మహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజ ఎక్కడ, ఎన్ని గంటలకు జరుగుతుందంటే?) క్లిక్ చేయండి. జనవరి 3వ తేదీ కూడా ఘట్టమనేని ఫ్యామిలీకి ఇంపార్టెంట్ డేట్.
జనవరి 3న కృష్ణ ఆఖరి సినిమా విడుదల
సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna Last Movie) నటించిన ఆఖరి సినిమా 'ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం'(Prema Charitra - Krishna Vijayam). ఈ నెల 3 (జనవరి 3)న థియేటర్లలోకి వస్తోంది. మధుసూదన్ హవల్దార్ దర్శకత్వం వహించడంతో పాటు ప్రొడ్యూస్ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడిన తర్వాత ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రావడం సాధ్యమైందని ఆయన తెలిపారు.
మధుసూదన్ హవల్దార్ మాట్లాడుతూ... ''నాగబాబు, చంద్ర మోహన్, బాలాదిత్యతో మూడు పాత్రలతో తీసిన 'వంశం' దర్శకుడిగా నా తొలి సినిమా. ఆ సినిమాకు రివార్డులతో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత 'అమెరికా - అమెరికా', 'నంబర్ వన్ హీరో' సినిమాలకు దర్శకత్వం వహించాను. ఈ రెండూ నాకు సంతృప్తి, పేరు తెచ్చాయి. 'ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం' దర్శకుడిగా నాకు నాలుగో సినిమా. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారిని డైరెక్ట్ చేయడం దర్శకుడిగా నా జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఈ సినిమా చేశాక కన్నడలో దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా బిజీ అయిపోయా. కృష్ణ గారి లాంటి లెజెండ్ నటించిన సినిమా రిలీజ్ కాకుండా ఉండటం నా మనసుకు నచ్చలేదు. అందుకని, లేటెస్ట్ టెక్నాలజీతో ఫస్ట్ కాపీ రెడీ చేశా'' అని చెప్పారు.
Also Read: మళ్లీ తల్లి కాబోతున్న ఇల్లీ బేబీ... న్యూ ఇయర్ వీడియోలో హింట్ ఇచ్చిన హీరోయిన్
'కృష్ణ చరిత్ర - ప్రేమ విజయం' రిలీజ్ లేట్ అయినా సరే బిజినెస్ పరంగా కొంత క్రేజ్ రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని మధుసూదన్ హవల్దార్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఏపీ, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, ఇంకా అనేక చోట్ల సినిమాను విడుదల చేస్తున్నాం. కృష్ణ గారి అభిమానులు అందరూ సినిమా కచ్చితంగా చూస్తారని నమ్ముతున్నా'' అని చెప్పారు.
కన్నడలో ఇప్పటివరకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించానని, ప్రస్తుతం తెలుగు - కన్నడ భాషల్లో ఇంటెన్స్ లవ్ స్టొరీ 'నా కూతురు లవ్ స్టోరీ' తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానని మధుసూదన్ హవల్దార్ చెప్పారు. 'ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం' చిత్రానికి ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించగా... మెగా బ్రదర్ నాగబాబు, అలీ ప్రధాన పాత్రల్లో, యశ్వంత్ - సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించారు.
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?