Ileana: మళ్లీ తల్లి కాబోతున్న ఇల్లీ బేబీ... న్యూ ఇయర్ వీడియోలో హింట్ ఇచ్చిన హీరోయిన్
తెలుగులో ప్రజెంట్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన గోవా బ్యూటీ ఇలియానా. హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత తెలుగుకు దూరం అయ్యారు. ఆవిడకు ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మ ఇవ్వనున్నారా?
తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఇల్లీ బేబీ అని పిలుచుకున్న గోవా బ్యూటీ ఇలియానా డి క్రూజ్ (Ileana). ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలు చేయడం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు ఆవిడ అంటే అభిమానం ఉంది. పెళ్లి చేసుకుని ఒక పిల్లాడికి జన్మనిచ్చిన ఇలియానా... కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరో బిడ్డకు ఆవిడ జన్మ ఇవ్వడానికి రెడీ అయ్యారా? అంటే... 'కావచ్చు' అని చెప్పాలి.
ఇలియానా వీడియోలో అది గమనించారా?
గడచిన ఏడాది (2024)కు వీడ్కోలు పలుకుతూ... కొత్త ఏడాది (2025)ని స్వాగతిస్తూ... జనవరి ఒకటో తేదీన సోషల్ మీడియాలో ఇలియానా ఒక వీడియో షేర్ చేశారు. ఆ తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అనే డౌట్ మొదలైంది. ఎందుకంటే...
జనవరి నుంచి డిసెంబర్ వరకు... 2024లో ప్రతి నెలకు సంబంధించి ఒక చిన్న మూమెంట్ ఆ వీడియోలో కనిపించింది. అన్ని నెలల కంటే అక్టోబర్ అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షించింది. అక్టోబర్ మంత్ గురించి వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఇలియానా ఎక్కువ ఎమోషనల్ అయ్యారు. సో... ప్రెగ్నెంట్ అని అక్టోబర్‌లో ఆవిడకు తెలిసి ఉండవచ్చు.
ఇలియానా అయితే ఆ విషయం చెప్పలేదు!
తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇలియానా అయితే కన్ఫర్మ్ చేయలేదు. కానీ ప్రెగ్నెన్సీ కిట్ వల్ల ఎక్కువ మందిలో సందేహాలు కలిగాయి. ఆల్రెడీ ఇలియానాకు ఒక బాబు జన్మించాడు. ఆగస్టు 2023లో పండంటి మగ బిడ్డకు ఆవిడ జన్మ ఇచ్చింది. అప్పటి నుంచి సినిమాలకు పూర్తిగా దూరం అయింది. మే 2023లో మైఖేల్ డోలాన్ (Ileana Husband Michael Dolan)ను ఇలియానా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతడితో వివాహానికి ముందు ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చాలా ఏళ్ళు ఇలియానా డేటింగ్ చేశారు. వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగిందని ప్రచారం జరిగినప్పటికీ... చివరకు బ్రేకప్ చెప్పకొన్నారు.
Also Read: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
View this post on Instagram
ఉస్తాద్ రామ్ పోతినేని 'దేవదాసు' సినిమాతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైంది ఇలియానా. సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా ఆవిడ నటించిన 'పోకిరి' ఇండస్ట్రీ హిట్ కాగా... మాస్ మహారాజా రవితేజకు జంటగా నటించిన 'కిక్' మంచి విజయం అందించింది. ఇలా చెప్పుకుంటూ వెళితే... ఇలియానా ఖాతాలో తెలుగు హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలగొందుతున్న చాలామందితో ఆవిడ నటించారు. అయితే... హిందీ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత తెలుగు సినిమాల తగ్గించారు. కొత్త కథానాయికలు రావడంతో ఆవిడ వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చూడటం మానేసింది. హిందీలో పరాజయాలు పలకరించిన తర్వాత రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా చేశారు. అయితే అది ఫ్లాప్ అయ్యింది. గత ఏడాది హిందీలో 'దో ఔర్ దో ప్యార్' సినిమా చేశారు. అది ఆశించిన విజయం ఇవ్వలేదు. ఇప్పుడు రెండో ప్రెగెన్సీ వల్ల ఇంకొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ రావచ్చు.
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?