By: ABP Desam | Updated at : 17 Mar 2022 07:11 AM (IST)
Vishwak_Sen
యువ హీరో విశ్వక్ సేన్‌లో దర్శకుడు కూడా ఉన్నారు. 'ఫలక్‌నుమా దాస్'కు ఆయన దర్శకత్వం వహించారు. అయితే... ఆ తర్వాత మెగాఫోన్ పట్టలేదు. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ... 'హిట్', 'పాగల్', 'అశోక వనంలో అర్జున కళ్యాణం', 'గామి' చిత్రాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ తనలో దర్శకుడిని విశ్వక్ సేన్ బయటకు తీశారు. 'పాగల్' దర్శకుడిని పక్కన పెట్టి 'దాస్ కా ధమ్కీ' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
విశ్వక్ సేన్ కథానాయకుడిగా మార్చి 9న 'దాస్ కా ధమ్కీ' సినిమా ప్రారంభం అయ్యింది. అప్పుడు 'పాగల్' ఫేమ్ నరేష్ కుప్పిలి చిత్రానికి దర్శకుడు. వారం తిరిగేసరికి సినిమా పోస్టర్ మీద దర్శకుడి పేరు మారింది. మార్చి 16న షూటింగ్ స్టార్ట్ అయ్యిందని చెబుతూ విడుదల చేసిన పోస్టర్‌లో దర్శకుడిగా విశ్వక్ సేన్ పేరు ఉంది. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే... క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా దర్శకుడు నరేష్ కుప్పిలి 'దాస్ కా ధమ్కీ' నుంచి తప్పుకొన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అదీ సంగతి! టైటిల్‌లో కూడా చిన్న మార్పు కనిపించింది. మొదట Das Ki Dhumki అని పేర్కొన్నారు. ఇప్పుడు Das Ki to Dhamki అని రాశారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' చూశా, 3 వేల కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ - కలరిస్ట్ నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్న 'దాస్ కా ధమ్కీ' సినిమాలో నివేదా పేతురాజ్ కథానాయిక. 'పాగల్'లోనూ విశ్వక్‌కు ఆమె జంటగా నటించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు.
Also Read: ఇది విన్నారా? చిరంజీవి సినిమాకు సల్మాన్ డబ్బులు తీసుకోవడం లేదట!
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
దిల్ రాజు చేతికి 'యానిమల్' రైట్స్ - ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా?
Rakshit Shetty: ఆమె కలలు పెద్దవి - రష్మిక గురించి షాకింగ్ విషయం బయపెట్టిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి
వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!
Vivek Agnihotri: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>