Salim Ghouse: రాముడిగా నటించిన సలీమ్ ఇక లేరు
నటుడు సలీం గౌస్ మృతి చెందారు. ఆయన హిందీ సినిమాలు, సీరియళ్లలో ఎక్కువ నటించినా.... కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.
సలీమ్ గౌస్ ఈతరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ, ముందు తరానికి... మరీ ముఖ్యంగా దూరదర్శన్‌లో సీరియళ్లు చూసిన వారికి సుపరిచితులే. డీడీలో వచ్చిన 'శుభ్' సీరియల్‌లో రాముడిగా, కృష్ణుడిగా సలీమ్ గౌస్ నటించారు. ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన టీవీ సిరీస్ 'భారత్ ఏక్ ఖోజ్'లోనూ ఆయన నటించారు. టిప్పు సుల్తాన్ రోల్ చేశారు.
సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకోవడం కంటే ముందే సలీమ్ గౌస్ సినిమా ప్రయాణం మొదలైంది. ఆయన్ను వెండితెరకు నటుడిగా పరిచయం చేసినది టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయన దర్శకత్వంలో బీఎన్ రెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి) నిర్మించిన 'స్వర్గ్ నరక్' సినిమా నటుడిగా సలీమ్ గౌస్ తొలి సినిమా. అది తెలుగు హిట్ 'స్వర్గం నరకం'కు హిందీ రీమేక్. ఆ తర్వాత వరుసగా హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చేశారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'అంతం' (హిందీలో 'ద్రోహి') సినిమాతో సలీమ్ గౌస్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'రక్షణ', 'ముగ్గురు మొనగాళ్లు', 'దొంగ దొంగ' తదితర చిత్రాలతో అలరించారు. హిందీలో షారుఖ్ ఖాన్ (Koyla movie)తో, మలయాళంలో మోహన్ లాల్ (Thazhvaram movie)తో, తమిళంలో కమల్ హాసన్ (Vettri Vizhaa movie)తో సలీమ్ గౌస్ నటించారు.
Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
సలీమ్ గౌస్ స్వస్థలం చెన్నై. పుణె ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్‌లో పట్టా పుచ్చుకున్న తర్వాత నటుడిగా ప్రయాణం ప్రారంహించారు. కొన్నేళ్లుగా ఆయన ముంబైలో ఉంటున్నారు. బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. సలీమ్ ఘోష్ మరణించినట్టు ఆయన సతీమణి అనితా సలీమ్ ధ్రువీకరించారు. ఆయన మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: కొరటాలతో ఎన్టీఆర్ సినిమాపై 'ఆచార్య' ఎఫెక్ట్? ఆందోళనలో యంగ్ టైగర్ ఫ్యాన్స్??
Salim Ghouse as Krishna in ‘Bharat Ek Khoj.
— Film History Pics (@FilmHistoryPic) April 28, 2022
He passed away today. Known his work in Doordarshan TV shows, theatre and films in five languages. #RIP #SalimGhouse pic.twitter.com/O2LA2YrFCA
Before Indian TV drowned into family politics, @DDNational turned out serials on issues such as consumer affairs & drug abuse. Still remember Salim Ghouse in Subah, a serial on the pitfalls of drug addiction. What an assured actor. He deserved 2 b seen more. RIP #SalimGhouse pic.twitter.com/i3VLHVWk4C
— Puja Awasthi (@pujaawasthi) April 29, 2022
An actor who can take over a scene by just being there, is no more. #salimghouse https://t.co/8yBz2JjBMz
— Arun Thangavel (@arunthevel) April 29, 2022
It was nice growing up in an India where a Salim could play a Ram, directed by a Shyam#RIP #SalimGhouse #discoveryofindia #Shyambenegal #bharatekkhoj pic.twitter.com/Cmv6T5KIE8
— Darain Shahidi (@darainshahidi) April 29, 2022