Varun Tej: గుడ్ న్యూస్ చెప్పబోతున్న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి... మెగా ఇంట మరో సంబరం!
Varun Tej Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని సమాచారం. ప్రస్తుతం లావణ్య గర్భవతి అని తెలుస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో గుడ్ న్యూస్ షేర్ చేయబోతున్నారని ఫిలిం నగర్ టాక్. ఈ స్టార్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారనేది న్యూస్.
లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్...
తండ్రి కానున్న వరుణ్ తేజ్!
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లిస్టులో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట ఒకటి. నవంబర్ 1, 2023లో వాళ్ళిద్దరి వివాహం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వరకు తమ ప్రేమ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచడంలో ఈ జంట సూపర్ సక్సెస్ అయ్యింది.
హీరో హీరోయిన్లు ఎవరైనా ప్రేమలో పడితే వాళ్ల గురించి వెంటనే న్యూస్ బయటకు వస్తుంది. అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట మీద ఎవరికి సందేహాలు రాలేదు. కుటుంబ సభ్యులను, తమ ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కింది. ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నారు.
శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా నటించారు ఆ తరువాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం సినిమా చేశారు. ఆ రెండు సినిమాలు చేసేటప్పుడు జరిగిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. పెళ్లయిన ఏడాదిన్నరకు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయ్యారు.
Also Read: క్యాప్ లేకుండా కనిపించిన మహేష్... కొత్త హెయిర్ స్టైల్... రాజమౌళి మూవీలో ఈ లక్కుంటే రచ్చ రచ్చే
స్టార్ కపుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని రెండు మూడు రోజుల క్రితమే లీక్స్ వచ్చాయి. ప్రేక్షకులలో చాలా మంది అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ జంట పేరెంట్స్ కాబోతున్నారని భావించారు. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని తర్వాత తెలిసింది.ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... పేరెంట్స్ కాబోతున్న స్టార్ కపుల్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి.
ప్రజెంట్ వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కొరియన్ కనకరాజు' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత 'రాధే శ్యామ్' దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమా చేస్తారని టాక్.
Also Read: శేష్ మామూలోడు కాదు... స్టేజి మీద 'హిట్ 3' హీరోయిన్ శ్రీనిధికి షాక్ ఇచ్చాడు... వైరల్ వీడియో చూడండి





















