Srinidhi Shetty: శేష్ మామూలోడు కాదు... స్టేజి మీద 'హిట్ 3' హీరోయిన్ శ్రీనిధికి షాక్ ఇచ్చాడు... వైరల్ వీడియో చూడండి
Srinidhi Shetty Viral Video: అడవి శేష్ మామూలోడు కాదని నెటిజనులు అంటున్నారు అది ఎందుకో తెలియాలంటే 'హిట్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక వైరల్ మూమెంట్ చూడాలి.

యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) మామూలోడు కాదని నెటిజనులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ కామెంట్స్ చేస్తున్నారు. అది ఎందుకో తెలియాలి? అంటే... 'హిట్ 3' (Hit 3) ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడాలి. ఆ వేడుకలో జరిగిన ఒక వైరల్ మూమెంట్ మీద మీరు కూడా ఒక లుక్ వేయాలి.
శ్రీనిధి శెట్టికి అడివి శేష్ షాక్!
'హిట్ 2' సినిమాలో అడివి శేష్ హీరో. ఆ మూవీ క్లైమాక్స్ వచ్చేసరికి న్యాచురల్ స్టార్ నాని అతిథి పాత్రలో కనిపించారు. ఆ క్యారెక్టర్ 'హిట్ 3'లో హీరో అయ్యింది. ఈ సినిమాలో అడవి శేష్ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు.
Also Read: 'హిట్ 3'లో హీరోయిన్‌తో అడివి శేష్ ఫైట్... చివరి అరగంటలో బోలెడు సర్‌ప్రైజ్‌లు!
'హిట్ 3'లో అడవి శేష్ నటించిన విషయాన్ని యాక్షన్ కొరియోగ్రాఫర్ సతీష్ లీక్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే... 'హిట్ 3' ప్రీ రిలీజ్ వేడుకకు శేష్ హాజరు అయ్యారు. స్టేజ్ మీద నిలబడిన సందర్భంలో శ్రీనిధి శెట్టి పక్కనే అడవి శేష్ ఉన్నారు. ఆమెకు ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. వెంటనే రెస్పాండ్ అయిన శ్రీనిధి శెట్టి హ్యాండ్ షేక్ చేయడానికి తన చేతిని ముందుకు తీసుకు వచ్చారు. ఆ సమయంలో అడివి శేష్ తనలో చిలిపి యువకుడిని ఆమెకు పరిచయం చేశారు. తన చేతిని వెనక్కి తీసుకున్నారు. అడవి శేష్ అలా చేస్తారని అసలు ఊహించని శ్రీనిధి షాక్‌కి గురి అయ్యారు. ఆవిడ అవాక్కయిన సందర్భాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెండు రోజులుగా అది వైరల్ అవుతోంది. ఆ మూమెంట్ మీరు కూడా చూడండి. సరదాగా కోసం అడివి శేష్ చేసిన పని వైరల్ అవుతోంది.
.@AdiviSesh ? 😜 pic.twitter.com/nFttsumrwU
— Rajesh Manne (@rajeshmanne1) April 29, 2025
Interesting scenes from #HIT3 Prerelease Event Found!!
— Siva 𝕏 (@Nameissiva272) April 28, 2025
Pic 1 : Sesh offers a Shakehand
Pic 2 : Takes hand Off!😅
Pic 3 : Srinidhi 's Expressions 😂
Em chesthunav Guru @AdiviSesh pic.twitter.com/Q8EBRYY7NB
'హిట్ 3' విషయానికి వస్తే... సెన్సార్ నుంచి పెద్దలకు మాత్రమే అంటూ 'ఏ' రేటెడ్ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ ఈ సినిమా చూడడానికి ఆడియన్స్ అందరూ విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో బుక్ మై షోలో ఈ మూవీ ట్రెండ్ అవుతోంది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే 1న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'హిట్ 3' రిలీజ్ అవుతోంది.
Also Read: జనవరి నుంచి జూన్‌కు ఎన్టీఆర్ నీల్ సినిమా... మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్ డేకు స్పెషల్ గ్లింప్స్





















