అన్వేషించండి

Viraaji Movie: ‘విరుపాక్ష’ స్థాయిలో వరుణ్ సందేశ్ థ్రిల్లర్ మూవీ ‘విరాజీ’ - టైటిల్ రిలీజ్ వీడియో చూశారా?

యంగ్ హీరో వరుణ్ సందేశ్ మరో కొత్త సినిమా చేస్తున్నారు. ‘విరాజి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు.

VIRAAJI Movie Title Reveal: ‘హ్యాపీడేస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత ‘కొత్త బంగారులోకం’ మూవీతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. మధ్యలో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న వరుణ్, ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన ‘నింద’ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. వసూళ్ల పరంగానూ ఫర్వాలేదు అనిపించింది.

‘విరాజి’ సినిమా టైటిల్ రిలీజ్

‘నింద’ సక్సెస్ జోష్ లో ఉన్న ఆయన తాజా మరో ప్రాజెక్టు చేస్తున్నారు. ‘విరాజి’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హారర్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతున్నట్లు అర్థం అవుతుంది. ఈ సినిమాను నూతన దర్శకుడు ఆద్యంత్ హర్ష తెరకెక్కిస్తున్నారు. మహా మూవీస్‌, M3 మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ టైటిల్ రిలీజ్ వేడుకలో నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణితో పాటు సంగీత దర్శకుడు ఎబినెజర్ పాల్, సినిమాటోగ్రాఫర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ‘విరూపాక్ష’ స్థాయిలో ఉందని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు.

నా కెరీర్ లోనే డిఫరెంట్ మూవీ: వరుణ్

ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను మేకర్స్ వెల్లడించింది. వరుణ్ సందేశ్ ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ లేని లుక్ లో కనిపిస్తారని వెల్లడించారు. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫస్ట్ లుక్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతుందన్నారు. అటు ఈ సినిమా కథ విని గూస్ బంప్స్ వచ్చాయని హీరో వరుణ్ సందేశ్ తెలిపారు. ‘విరాజి’ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్, డిఫరెంట్ మూవీ అవుతుందన్నారు. త్వరలో విడుదలయ్యే ఫస్ట్ లుక్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతారని వెల్లడించారు. రీసెంట్ గా తాను నటించిన ‘నింద’ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ రాజేష్ కు ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయని, ‘విరాజి’ సినిమా దర్శకుడుడి కూడా భవిష్యత్ లో అలాంటి అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.   

‘రాచరికం’లోనూ నటిస్తున్న వరుణ్

‘విరాజి’ సినిమాతో పాటు వరుణ్ సందేశ్ ‘రాచరికం’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సురేష్ లంకపల్లి తెరకెక్కించారు. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోంది.  

Read Also: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget