X

Uttej: ఉత్తేజ్ ఇంట తీవ్ర విషాదం.. భార్య మృతి, పరామర్శించిన చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖులు

తెలుగు నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి ఈ రోజు కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖలు ఆయన్ను పరామర్శిస్తున్నారు.

FOLLOW US: 

ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్యా పద్మావతి సోమవారం ఉదయం మరణించారు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజులుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో కన్నుమూశారు. భార్య మరణంతో ఉత్తేజ్ కన్నీరుమున్నీరయ్యారు.  పలువురు ప్రముఖులు ఆసుపత్రికెళ్లి ఉత్తేజ్ ను ఓదార్చారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన ఆసుపత్రికెళ్లి ఉత్తేజ్ ను పరామర్శించారు.  ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, జీవితా రాజశేఖర్... తదితరులు కూడా ఆసుపత్రికెళ్లారు. ఉత్తేజ్, ఆయన ఇద్దరు కూతుళ్లు కన్నీంటిపర్యంతమవుతున్నారు. 

ఉత్తేజ్ చేసే ప్రతి పనిలో భార్య పద్మావతి కూడా పాలుపంచుకునేవారు. ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో కూడా ఆమె భాగస్వామ్యం ఉండేది. అలాగే ఆమె ఓ వస్త్ర దుకాణాన్ని కూడా నడుపుతున్నారు. దాని బాధ్యతలు కూడా పూర్తిగే పద్మావతే చూసుకునేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె మరణించడంతో ఉత్తేజ్ ను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. చిరంజీవిని పట్టుకుని అన్నయ్య... అన్నయ్య అంటూ ఉత్తేజ్ రోదిస్తుంటే... అక్కడున్నవాళ్లంతా కంటతడి పెట్టుకున్నారు. Uttej: ఉత్తేజ్ ఇంట తీవ్ర విషాదం.. భార్య మృతి, పరామర్శించిన చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖులు

శివ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యాడు ఉత్తేజ్. అదే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు... చేతన, పాట. చేతన బద్రి, చిత్రం సినిమాల్లో బాలనటిగా నటించింది. పిచ్చిగా నచ్చావ్ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. తరువాత ప్రేమవివాహం చేసుకుని టాలీవుడ్ దూరమైంది. సినీగేయ రచయిత సుద్దాల అశోక తేజ ఉత్తేజ్ కు మేనమామ అవుతారు. 

Tags: chiranjeevi Tollywood Uttej's wife Cancer Hospital

సంబంధిత కథనాలు

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..

Upasana: ఉపాసన చెల్లెలి పెళ్లిలో రామ్ చరణ్ సందడి..

Upasana: ఉపాసన చెల్లెలి పెళ్లిలో రామ్ చరణ్ సందడి..

Katrina-Vicky Wedding: కత్రినా, విక్కీ కౌశల్ వెడ్డింగ్ కార్డ్ లీక్.. పోస్ట్ వైరల్..

Katrina-Vicky Wedding: కత్రినా, విక్కీ కౌశల్ వెడ్డింగ్ కార్డ్ లీక్.. పోస్ట్ వైరల్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!

Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!