Tollywood Updates : 'గల్లీరౌడీ'కి 'స్టేట్ రౌడీ' సపోర్ట్.. ఓటీటీలో స్టార్ హీరో సినిమా.. మాస్ట్రో ప్రమోషనల్ సాంగ్..
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
'గల్లీ రౌడీ' ట్రైలర్ లాంచ్..
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన 'గల్లీ రౌడీ' ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటు ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 'గల్లీరౌడీ' ట్రైలర్ ను చిరంజీవి చేతుల మీదుగా చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సందీప్ కిషన్ విశాఖపట్టణంలో 'గల్లీరౌడీ'గా ఆయన కనిపించనున్నారు. సందీప్ డైలాగులు, కామెడీ టైమింగ్, బాబీ సింహా యాక్షన్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాను జి.నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ మిరియాల, సాయికార్తిక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Pics from the launch of #GullyRowdy trailer by Megastar @KChiruTweets garu!!
— Ramesh Bala (@rameshlaus) September 12, 2021
Trailer ▶️ https://t.co/AhyBo6HKbT#GullyRowdyOnSept17th@sundeepkishan @actorsimha #NehaShetty @Ram_Miriyala @iamsaikartheek #GNageswaraReddy @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp @MangoMusicLabel pic.twitter.com/C9QK1qZpAo
అమెజాన్ లో అక్షయ్ కుమార్ సినిమా..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బెల్ బాటమ్' సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ నెల 16 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సినిమా గత నెల 19న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. 1984లో జరిగిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ కథే ఈ సినిమా. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ రా ఏజెంట్ గా నటించాడు. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
Date aap yaad rakhna, mission hum yaad dila denge. #BellBottomOnPrime, releases September 16.@PrimeVideoIN @vashubhagnani @vaaniofficial @humasqureshi @LaraDutta @ranjit_tiwari @jackkybhagnani @honeybhagnani @poojafilms pic.twitter.com/iMbmEjOJDq
— Akshay Kumar (@akshaykumar) September 12, 2021
మాస్ట్రో ప్రమోషనల్ సాంగ్..
నితిన్, నభా నటేష్ జంటగా తెరకెక్కిన సినిమా 'మ్యాస్ట్రో'. తమన్నా కీలకపాత్ర పోషిస్తుంది. హిందీలో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ 'అంధాధూన్'కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను హాట్ స్టార్ లో ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా 'షురూ కరో' అనే ప్రచార గీతాన్ని రూపొందించారు. తాజాగా ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో హీరో లైఫ్ గురించి, కీలకపాత్రలు గురించి ఈ పాటతో చిత్రబృందం పరిచయం చేసింది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.