Harish Shankar: ట్రెండింగ్ గా మారిన హరీష్ శంకర్ ట్వీట్స్.. జర్నలిస్ట్ తో మాటల యుద్ధం..
హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి తెలిసిందే.
హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి తెలిసిందే. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో నమోదు చేసుకున్నారు. అయితే అది నిజం కాదని.. ఇసుక వలనే బైక్ స్కిడ్ అయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో పోలీసుల విచారణలో తేలుతుంది. కానీ విచారణకు ముందే కొన్ని టీవీ ఛానెల్స్ సాయి ధరమ్ తేజ్ విషయంలో నెగెటివ్ ప్రచారం చేశాయి.
Also Read : Sai Dharam Tej Health Update: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల
రెండు రోజులుగా సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన రకరకాల విశ్లేషణలతో హోరెత్తిస్తున్నాయి. అందులో ఓ టాప్ న్యూస్ చానె చేస్తున్న హడావిడి జర్నలిజం విలువలకు దూరంగా సాగుతోందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ కూడా సదరు ఛానెల్స్ పై మండిపడుతూ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు.
''హాట్స్ ఆఫ్ తమ్ముడు సాయి ధరమ్ తేజ్.. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్.. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరు బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను'' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన ప్రముఖ ఛానెల్ ఇన్ పుట్ ఎడిటర్ హరీష్ ట్వీట్ పై స్పందించారు. దీంతో వీరిద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. అదిప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
హాట్స్ ఆఫ్ తమ్ముడు @IamSaiDharamTej
— Harish Shankar .S (@harish2you) September 11, 2021
హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్
నీ ఆక్సిడెంట్ వంకతో ….
తప్పుడు వార్తలు అమ్ముకొని
బతికేస్తున్న అందరు బాగుండాలి
వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏;
నేను “ తప్పుడు వార్తలు “అని క్లియర్ గా mention చేశాను కదా మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు … అంటే … ఒప్పుకున్నట్టేనా ?
— Harish Shankar .S (@harish2you) September 11, 2021
Thank you .. for ur clarity ; https://t.co/DbBj87XRYM
ఇక పోతే మాసినిమాల్లో హింస అన్నారు మాకు సెన్సార్ ఉంది మేము వాళ్లకు answerable .. మీకేముంది మీరు దేనికి answerable కాస్త చెబుతారా ? Ramesh గారు నేను మీ వ్యవస్థని తప్పు పట్టట్లేదు వ్యవస్థని తప్పు దోవ పట్టించేవాళ్ల గురించి చెబుతున్నాను !! Pls try to understand the issue here; https://t.co/DbBj87XRYM
— Harish Shankar .S (@harish2you) September 11, 2021
మరి సెన్సార్ member గా చేశా అంటున్నారు కదా
— Harish Shankar .S (@harish2you) September 11, 2021
ఈ సినిమా లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం నిజం కాదు అని మేము వేస్తాం ; మీరూ న్యూస్ ముందు ఇదంతా నిజం కాదు కేవలం మా a channel కల్పితం అని వేయండి మరి ! జనాలకి ఒక క్లారిటీ ఉంటది !! Or else stop comparing films with news !!! https://t.co/Dbma0SX4RJ
Also Read: Sai Dharam Tej: తేజ్‌కు ఆంజనేయుడి అండ.. ఆ చిరంజీవే కాపాడుతాడంటూ ఫ్యాన్స్ విశ్వాసం, ఆలయాల్లో పూజలు