అన్వేషించండి

Trisha: నాకు నలుగురు పిల్లలు, వాళ్ళకు రెండేళ్ళు... రిటైర్మెంట్‌పై త్రిష సెటైర్!

Trisha Latest Instagram Story: టీవీకే పార్టీతో దళపతి విజయ్ రాజకీయ అడుగులు త్రిషను రాజకీయ విమర్శల్లోకి లాగాయి. దాంతో నటనకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని పుకార్లు వచ్చాయి. వాటిపై ఆమె స్పందించారు.

తమిళనాడులో కథానాయిక త్రిష కృష్ణన్ (Trisha Krishnan) మీద రోజుకొక కొత్త వార్త వస్తోంది. దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయ తెరంగేట్రం ఆమెను విమర్శల్లోకి లాగింది. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని విజయ్ ప్రత్యర్థులు బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. విజయ్ భార్య సంగీత అయితే తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని విడాకుల పిటీషన్‌లో పేర్కొన్నారు.  త్రిషపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారని తమిళనాడు అంటోంది. అది పక్కన పెడితే... త్వరలో సినిమాలకు త్రిష గుడ్ బై చెబుతారని, రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. దాంతో ఆమె స్పందించారు. 

త్రిష రిటైర్మెంట్ గురించి చెప్పిందెవరు?
Trisha Retirement News In Telugu: విజయ్ - సంగీత విడాకులు వ్యవహారం ఓ కొలిక్కి రాలేదింకా. అదే సమయంలో విజయ్ - త్రిష సైతం తమ మధ్య ప్రేమ ఉందని, తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పలేదు. ఈ తరుణంలో సినిమాల నుంచి త్రిష రిటైర్ అయ్యారని తమిళ నటుడు చిత్ర లక్ష్మణన్ తన యూట్యూబ్ ఛానల్‌లో వ్యాఖ్యానించారు. తన పెళ్లి, పిల్లల గురించి వస్తున్న వార్తల పట్ల ఆమె 'ఫిక్షన్ కోటా' అంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు.

తన రిటైర్మెంట్, వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లపై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చాలా వ్యంగ్యంగా స్పందించారు త్రిష. ఇంతకీ, ఆమె ఏమన్నారంటే?... ''నేను సినిమాల నుంచి తప్పుకొన్నాను (రిటైర్మెంట్ ఇచ్చాను). బాగా డబ్బులు ఉన్న వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను. మాకు నలుగురు కవల పిల్లలు. నిన్ననే వాళ్లకు రెండేళ్లు నిండాయి. ఇంకా ఏమైనా చెప్పాలా? లేదంటే ఈ రోజుకు కావలసిన ఫిక్షన్ కోటా (కల్పిత కథలు) పూర్తి అయ్యాయా?'' అని. తనకు పెళ్లి కాలేదని, పిల్లలు లేరని, సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదని ఇలా చెప్పారు. అదీ సంగతి!

Also ReadVaranasi: వారణాసి... విడుదలకు సరిగ్గా ఏడాది - చెప్పిన తేదీకి మహేష్, రాజమౌళి సినిమా

విమర్శలు, పుకార్లకు సమాధానం ఇవ్వడమే కాదు... మనఃశాంతి, ఆత్మ గౌరవం గురించి కొన్ని పోస్ట్‌లు చేశారు. ''నేను ఎవరితోనూ వాదించను. ప్రస్తుతం ఆ దశలో ఉన్నాను. మీరు ఏనుగు ఎగురుతుందని చెబితే... మీరు చెప్పింది కరెక్టేనని అంటాను. ఎందుకంటే... మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక నాకు లేదు. నాకు నా ప్రశాంతతే ముఖ్యం'' అని ఓ కోట్ చెప్పారు. ప్రతిదీ ప్రేమ కాదని, ప్రేమ లేని ప్రతిదీ అర్థరహితం అని అర్థం వచ్చే మరొక కోట్ రెండు రోజుల క్రితం షేర్ చేశారు. 

Also Read: Peddi: 'పెద్ది' వాయిదా పక్కా - మరి విడుదల జూన్ మొదటి వారంలోనా? లేదంటే...

సినిమాల విషయానికి వస్తే... త్వరలో కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహించిన 'కరుప్పు'లో ఆమె సూర్యకు జంటగా నటించారు. తెలుగులో ఆ సినిమా 'వీరభద్రుడు'గా విడుదల కానుంది.

Also Read: Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget