Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
Devara Movie: 'దేవర' రిలీజ్ హక్కుల కోసం మూడు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ మూవీ నార్త్ రైట్స్ కరణ్ జోహార్ సొంతం చేసుకున్నట్టు సమాచారం.
![Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో! Top Three Production Houses In Race For Devara Distribution Rights Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/e88475a6c2782620194c4f0eb86fd8b91713269241912929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Three Production Houses Race in Devara Telugu Roghts: టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో 'దేవర' మూవీ ఒకటి. కొరటాల శివ, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియాగా వస్తున్న సంగతి తెలిసిందే. 'జనతా గ్యారేజ్' లాంటి బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో మళ్లీ దేవర వస్తుండటం, ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. దాదాపు 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ షెడ్యూల్‌లో సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన కీలక సన్నివేశాలను జరుపుకుంటుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరకు బ్రేక్ ఇచ్చి వార్ 2 సెట్‌లో వాలిపోయాడు. ఇదిలా ఉంటే మూవీ విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో దేవరకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కుల కోసం మూడు అగ్ర నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన 'దేవర' డిస్ట్రిబ్యూటర్స్‌ని లాక్ చేసుకుందట. ఇక తెలుగు డిస్ట్రీబ్యూషన్ కోసం మూడు అగ్ర నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్టు ఇన్‌సైడ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారు దిల్ రాజు, మత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ రైట్స్‌ని చేజిక్కించుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు మేకర్స్.
Happy to join forces with the dynamic distributors of our country, Karan Johar and AA Films for the North India theatrical distribution of #Devara! 🌊
— Devara (@DevaraMovie) April 10, 2024
Looking forward to a thunderous release on 10th October 2024! ⚡️
Man of Masses @tarak9999 #KoratalaSiva #KaranJohar… pic.twitter.com/AoSYQsteXa
ముందు నైజాం హక్కులనే అనుకున్నా దిల్ రాజు
గతంలో దిల్ రాజు వైజాగ్ ప్రాంతంతో పాటు నైజాం హక్కులపై దృష్టి పెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఏకంగా రెడు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాడట. అందుకే మూవీ మొత్తం రైట్స్‌ని దక్కించుకునేందుకు ఆ దిశ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ మూవీ రిలీజ్ రైట్స్‌ని చేజిక్కించుకోవడానికి చూస్తుందట. కొన్ని ఏరియాలనే మాత్రమే వాటాలు తీసుకోకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన నాగ వంశీ కూడా దేవర హక్కులను దక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా 'దేవర' మూవీ తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం మూడు నిర్మాణ సంస్థలు పోటీ పడుతుండటంతో నిర్మాతలు డైలామాలో ఉన్నారట. ఈ మూవీ మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఫైనల్‌గ్ 'దేవర' రైట్స్ ఎవరి చేతులకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తిని సంతరించుకుంది. ఇక 'దేవర' మూవీ నార్త్‌లో రైటర్స్ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నాడు. తన సొంత బ్యానర్ ధర్మప్రొడక్షన్‌లో ఈ మూవీని ఉత్తరాదిన డిస్ట్రీబ్యూట్ చేయబోతున్నాడు. కాగా ఎన్‌టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ‘దేవర’ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)