‘మిలియన్’ క్లబ్బులో భగవంత్ కేసరి, ‘సరిపోదా శనివారం’ ఫస్ట్‌లుక్, టైటిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ మార్క్ దాటేసిన 'భగవంత్ కేసరి' - బాలయ్య హ్యాట్రిక్
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లోనే మునుపెన్నడూ లేనంత ఫుల్ ఫార్మ్ లో కొనసాగుతున్నారు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే, మరోవైపు వెండితెరపై విజృంభిస్తున్నారు. ఇప్పటికే 'అఖండ', 'వీర సింహా రెడ్డి' సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన బాలయ్య.. లేటెస్టుగా 'భగవంత్ కేసరి' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా డొమెస్టిక్ మార్కెట్ లోనే కాదు, ఓవర్ సీస్ లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం USA బాక్స్ ఆఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సంకెళ్లతో నాని.. ఆసక్తి రేకెత్తిస్తోన్న 'సరిపోదా శనివారం' ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్!
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘అంటే సుందరానికి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇది నాని కెరీర్ లో 31వ చిత్రం. శనివారం ఈ చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. అనౌన్స్ మెంట్ వీడియోని వదిలారు. దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని 'అన్‌చైన్‌డ్' పేరుతో ఈరోజు (అక్టోబర్ 23) ఉదయం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అనారోగ్యం బారినపడిన బాల్య మిత్రుడి కోసం ఏం చేశారంటే?
మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం గురించి, దాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే నేనున్నానంటూ ఆపద్భాంధవుడుగా నిలిచే చిరు.. గత కొన్నేళ్లుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించి ఎందరి ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు. కేవలం తన అభిమానులకే కాకుండా తోటి కళాకారులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులు, స్నేహితులకు కూడా ఆయన అండగా నిలుస్తూ ఉంటారు. అయితే ఎంత చేసినా చిరు ఎప్పుడూ తన సహాయం గురించి చెప్పుకోరు. సాయం పొందిన వ్యక్తులు బయటకు చెప్పినప్పుడు మాత్రమే అందరికీ తెలుస్తుంటాయి. తాజాగా మెగాస్టార్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యం బారిన పడిన చిన్ననాటి మిత్రుడికి మర్చిపోలేని సాయం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నువ్వు మాత్రమే పోగలవు, నిన్ను ఎవడూ పంపలేడు - శోభా శెట్టిపై శివాజీ ఫైర్, అశ్వినీ అదే ఫైర్
‘బిగ్ బాస్’లో సోమవారం నామినేషన్స్ వాడీ వేడిగా సాగున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో కుంపటి పెట్టి మరీ కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. కంటెస్టెంట్లు ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో.. వారి ఫొటోలను మంటల్లో వేయాలి. శివాజీ.. శోభాశెట్టిని నామినేట్ చేశాడు. భోలే బూతులు మాట్లాడటం తప్పు అంటూనే.. ఆయన క్షమాపణలు కోరినా పట్టించుకోకపోవడాన్ని తప్పుబడుతూ శివాజీ ఆమెను నామినేట్ చేశాడు. అయితే, శోభా కూడా శివాజీతో గట్టిగానే వాదించింది. క్షమించాలా, వద్దా అనేది తన నిర్ణయమని పేర్కొంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బిగ్ షాక్ - షో మధ్యలో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అరెస్ట్
‘బిగ్ బాస్’ షోలో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, సామాన్యులు పాల్గొంటారనే సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది బాగా పాపులర్ లేదా వివిధ వివాదాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితులైనవారే ఉంటారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు కూడా ‘బిగ్ బాస్’లో ఛాన్స్ వస్తోంది. అయితే, ‘బిగ్ బాస్’ షోలో ఉన్న కంటెస్టెంట్ వివిధ కేసుల కోసం షో మధ్య నుంచి వెళ్లడం మనం చూశాం. గతంలో ‘బిగ్ బాస్’ తెలుగులో ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ కోసం ‘బిగ్ బాస్’ను విడిచి వెళ్లింది. అయితే, కంటెస్టెంట్ అరెస్టు కావడం అనేది మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. తాజాగా కన్నడ ‘బిగ్ బాస్’లో ఆ ఘటన చోటుచేసుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)